పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కు తోడు దొరికిందా..? | Power star Pawan Kalyan has been linked with former wife Renu Desai.

Power star Pawan Kalyan has been linked with former wife Renu Desai
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో  చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ చూశాక ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అర్థమవుతోంది.  శనివారం రేణుదేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్టు చేసింది. ఓ వ్యక్తి చేయి పట్టుకొని దిగిన ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆ వ్యక్తి గురించి వివరిస్తూ ఓ కవితను కూడా రేణుదేశాయ్ పోస్టు చేయడంతో సంచలనమైంది.

అయితే రేణుదేశాయ్ చేయిపట్టుకున్న వ్యక్తి ఎవరనేది ఆమె బయటపెట్టలేదు. కేవలం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కవితరూపంలో వెల్లడించి ఆశ్చర్యపరిచింది.. రేణు దేశాయ్ రాసుకొస్తూ ‘ప్రేమ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. కవితలోనే అది దొరుకుతుందని భావించాను. కొన్ని సార్లు క్యాండిలైట్ డిన్నర్లు - మరికొన్నిసార్లు తీపి అబద్దాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి’ అంటూ రేణు కవితాత్మకంగా చెప్పింది.

దాంతోపాటు ‘నీ నిజాయితీ - నీ మాటల్లో నాకు ప్రేమ దొరికింది. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వదిలి వెళ్లకు. నాలో నువ్వు ఆ నమ్మకాన్ని కల్పించావు’ అంటూ కవితను ముగించారు. దీంతో రేణు కు వ్యక్తి తోడు దొరికిందని.. అతడి గురించే ఆమె కవితలో చెప్పారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో ఆమె నేను రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించినప్పుడు పవన్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పవన్ భార్య రెండో పెళ్లి చేసుకోవడం తమకి ఇష్టం లేదని ఆమె మాకు వదిన అంటూ చెప్పుకొచ్చారు. దీనితో పవన్ అభిమానుల దుర్మార్గపు ఆలోచనలకు ఆమె గట్టిగానే సోషల్ మీడియా సాక్షిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరికొంత మందైతే విడాకుల పేరుతొ చేసుకున్న ప్రతి భార్యను ఎంజాయ్ చేసి వదిలేస్తున్న పవన్ కు విలువ ఇవ్వాల్సిన పని లేదని రేణు దేశాయ్ సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చని ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...