రెండో పెళ్లిపై రియాక్ట్ అయిన రేణూ! | Renu react on second marriage!

Renu-Desai-Responds-on-her-Engagement-Andhra-Talkies.jpg

రెండో పెళ్లిపై రియాక్ట్ అయిన రేణూ! | Renu react on second marriage!

పవన్ మాజీ భార్య ట్యాగ్ ఎంత భారమైందో రేణూకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ఓపక్క తనతో తెగ తెంపులయ్యాక.. తనదైన జీవితాన్ని పవన్ జీవిస్తుంటే.. రేణూను మాత్రం గతం వెంటాడుతూ ఉండటం తెలిసిందే. పవన్ తో విడిపోయి.. ఆయనకు మరో పెళ్లి జరిగిపోయిన తర్వాత కూడా పెళ్లి వద్దంటూ.. ఒక్కరిగానే ఉండాలంటూ చెప్పే వారు తక్కువే కాదు.

సింగిల్ మదర్కు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనుభవించే వారికి తెలుస్తాయి కానీ.. మామూలోళ్లకు ఓ పట్టాన అర్థం కావు. సింగిల్ మదర్ గా ఉండటం ఎన్ని తిప్పలో తాను స్వయంగా అనుభవించిన తర్వాతే రేణూ.. మరో తోడు అవసరమని ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పటం.. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏమైనా.. తనను విపరీతంగా అభిమానించే అభిమానుల్ని హర్ట్ చేయకుండా ఉండేందుకు రేణూ పడే తపన ఎంతన్నది ఆమె పోస్టులు చూస్తే ఇట్టే అర్థమైపోతాయి.


గతం తానకో పెద్ద బ్యాగేజ్ అయి.. అది నిత్యం వెంటాడుతున్నా..ఆ భారానికి ఫీల్ కాకుండా.. బాధ్యతగా వ్యవహరించటం అంత తేలికైన ముచ్చట కాదు. కానీ.. ఒంటరిగా ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన రేణూ.. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ విషయాన్ని ఒక్కసారి చెబితే షాక్కు గురవుతారన్న ఉద్దేశం కావొచ్చు.. ఎందుకైనా మంచిదన్న కోణంలో.. ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్ట్.. పార్ట్ లుగా తన రెండో పెళ్లి మీద రియాక్ట్ అవుతున్న రేణూ.. తాజాగా తన ఎంగేజ్ మెంట్ ఫోటోలపై అభిమానుల స్పందనపై స్పందించారు.

కాబోయే భర్త తన చేతికి ఉంగరం తొడుగుతున్న ఫోటోతో పాటు.. తాను నవ్వులు చిందిస్తున్న ఫోటోను కాస్త కత్తింరించి.. తాను మనువాడే వాడి ముఖం కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన రేణూ దేశాయ్.. తన పోస్టుపై రియాక్ట్ అవుతున్న వారి తీరుపై తాజాగా స్పందించారు.

తాను పెళ్లి చేసుకోనున్న వ్యక్తి ఎవరన్న వివరాల్ని వెల్లడించని రేణూ..  తన ఎంగేజ్ మెంట్పై స్పందిస్తున్న వారిని ఉద్దేశించి ఒక పోస్టు పెట్టారు. తనకు అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల నుంచే ఎక్కువగా మద్దతు వస్తోందని తెలుసుకొని చాలా సంతోషిస్తున్నట్లుగా చెప్పారు. తనకు మద్దతు తెలుపుతున్న అబ్బాయిల తల్లిదండ్రులకు ఆమె ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే.. వారిని అంత చక్కగా పెంచినందుకు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

"నాకు మద్దతు తెలుపుతున్న అబ్బాయిల పేరెంట్స్ కు ధన్యవాదాలు తెలపాలని ఉంది.. వారిని చక్కగా పెంచారు. ఈ తరం అబ్బాయిల్లో మహిళలకు సమానత్వం ఇవ్వాలన్న విషయంలో క్లారిటీ ఉంది. ధన్యవాదాలు" అంటూ ఆమె తన స్పందనను తెలియజేశారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...