ల్యాబ్ ముందు శిల్పా.. రూమర్లే రూమర్లు | Shilpa-Shetty-was-recently-spotted-outside-a-diagnostic-centre-Andhra-Talkies

Shilpa-Shetty-was-recently-spotted-outside-a-diagnostic-centre-Andhra-Talkies

ల్యాబ్ ముందు శిల్పా.. రూమర్లే రూమర్లు | Shilpa-Shetty-was-recently-spotted-outside-a-diagnostic-centre-Andhra-Talkies

సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వాళ్లకు సంబంధించి ఏ చిన్న విషయమైనా వార్తగా మారిపోతుంది. సెలబ్రెటీలు బయట ఎక్కడ కనిపించినా.. ఏం చేస్తున్నా జనాలు ఒక కన్నేసి ఉంచుతారు కాబట్టి వారి చర్యల్ని బట్టి రకరకాల అంచనాలకు వచ్చేస్తుంటారు. ఏవో పుకార్లు పుట్టించి ప్రచారం చేసేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి విషయంలో ఇలాంటి ప్రచారమే ఒకటి మొదలైంది.

శిల్పా ఒక డయాగ్నస్టిక్స్ సెంటర్ నుంచి రిపోర్టులతో బయటికి వస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక అభిమాని.. ‘‘శిల్పా చేతిలో రిపోర్ట్స్ పట్టుకుని టెస్ట్ ల్యాబ్ సెంటర్ నుంచి బయటికి రావడం చూశాను. ఏదైనా అద్భుతమా’’ అని ట్వీట్ చేశాడు. దీంతో దీని మీద పెద్ద డిస్కషన్లు మొదలైపోయాయి. శిల్పా మళ్లీ తల్లి కాబోతోందంటూ ప్రచారం జరిగిపోయింది. కొందరేమో ఏమైంది శిల్పా అంటూ ఆమెను ట్యాగ్ చేసి ఆరాలు తీయడం మొదలు పెట్టారు.ఈ ప్రచారం.. ఆరాలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో శిల్పా శెట్టి స్పందించక తప్పలేదు. తన జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదని ఆమె స్పష్టం చేసింది. ఎప్పట్లాగే ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ల్యాబ్ నుంచి బయటికి వస్తున్నానని.. అంతకుమించి ఏమీ లేదని.. తాను ప్రెగ్నెంట్ కాదని శిల్పా క్లారిటీ ఇచ్చింది. దీంతో రూమర్లకు చెక్ పడింది. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన శిల్పా ఇప్పటికే ఒక కొడుకుని కంది. ఆ పిల్లాడి పేరు వియాన్ రాజ్ కుంద్రా. సినిమాలు మానేశాక భర్తతో కలిసి వ్యాపారాలు చేస్తోంది శిల్పా. వాళ్లిద్దరూ కలిసి ఇంతకుముందు ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ లో భాగస్వాములుగా ఉన్నారు. శిల్పా సొంతంగా యోగా ట్రైనింగ్ కూడా ఇస్తుంటుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...