నానీని ఆడుకుంటున్న శ్రీరెడ్డి | Sri-Reddy-Tries-To-Troll-Nani-Andhra-Talkies

Sri-Reddy-Tries-To-Troll-Nani-Andhra-Talkies

నానీని ఆడుకుంటున్న శ్రీరెడ్డి | Sri-Reddy-Tries-To-Troll-Nani-Andhra-Talkies

అసలే ‘బిగ్ బాస్’ రెండో సీజన్కు ముందు అనుకున్నంత బజ్ లేదు. దీనికి తోడు షో ఫస్ట్ వీక్ రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నాని షోను హోస్ట్ చేస్తున్న తీరు మీద ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. తారక్ తో ఇతడిని పోల్చడం ద్వారా గాలి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి శ్రీరెడ్డి చెలరేగిపోతోంది. నానిని సోషల్ మీడియాలో ఆడుకుంటోంది. ఇన్నాళ్లూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. ఇప్పుడు ‘బిగ్ బాస్’లో నాని పెర్ఫామెన్స్ పై విమర్శలు గుప్పిస్తోంది. తమకు తారకే బిగ్ బాస్ హోస్ట్ గా కావాలంటూ అతడి అభిమానులు మొదలుపెట్టిన క్యాంపైనింగ్ ను చూపిస్తూ నాని గాలి తీసే ప్రయత్నం చేస్తోంది శ్రీరెడ్డి. ఈ విషయమై ట్విట్టర్లో శ్రీరెడ్డి పెట్టిన మెసేజ్ వైరల్ అవుతోంది.‘‘బిగ్ బాస్ 2 లో నాని మిద ప్రేక్షకుల స్పందన ఇలా ఉంది బిగ్ బాస్ షో కి నాని అసలు ఏమాత్రం సూట్ అవ్వలేదని నాని ప్రదర్సన చూస్తుంటే నిద్ర వస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ గారిలో ఉన్న ఉత్సాహం నటన సామర్ద్యాలు నాని లో ఇసుక రవ్వంత కూడా లేవని మా తారక్ ని చాలా మిస్ అవుతున్నామని బాధపడుతున్నారు’’ అని శ్రీరెడ్డి పేర్కొంది. నిన్నటి బిగ్ బాస్ షోలో నాని ఇన్ డైరెక్టుగా శ్రీరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమెకు క్లాస్ పీకే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి అదేమీ పట్టించుకోకుండా నాని మీద దాడిని కొనసాగిస్తోంది. ఈ నెగెటివ్ కామెంట్లన్నీ అయ్యాక ‘గుడ్ నైట్ నాని’ అంటూ ఆమె మెసేజ్ పెట్టడం విశేషం. మరి మున్ముందు నాని-శ్రీరెడ్డి పోరు ఎలా ఉంటుందో చూడాలి. తనపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తదుపరి పరిణామాలేంటో ఇంకా వెల్లడి కాలేదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...