ఆయనలో అంత స్పెషాలిటీ ఏంటో | What is specialty in him?

Telugu-Film-Makers-Encourages-Jockey-Shroff-Andhra-Talkies-Telugu
బాలీవుడ్ యాక్టర్లను తెలుగులో నటింపచేయడం.. ఎప్పుడూ క్రేజీగానే ఉంటుంది. హీరోయిన్స్ మాత్రమే కాదు.. విలన్స్ - క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తెలుగులోకి వస్తుంటారు. బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ కి తమ నటనా చాతుర్యం చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ను తెలుగు ఫిలిం మేకర్స్ తెగ ఆదరిస్తారు.

ఎందుకో తెలియదు కానీ.. ఈయన అంటే మనోళ్లు తెగ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఈయన చేసినన్ని స్ట్రెయిట్ తెలుగు ఫిలిమ్స్.. మరే బాలీవుడ్ యాక్టర్ చేసి ఉండడు కూడా. ప్రస్తుతం ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ సాహోలో నటిస్తున్న జాకీ ష్రాఫ్.. టాలీవుడ్ మూవీ ప్రస్థానం ను హిందీలో సంజయ్ దత్ తో రీమేక్ చేస్తుండగా.. అందులో కూడా నటించేందుకు ఎంపికయ్యాడు. ఇంతలేసి ఆఫర్స్ వచ్చేయడానికి ఈయనేమీ గోల్డెన్ హ్యాండ్ కాదు.. పైగా తెలుగు సినిమాలకు సంబంధించి ఈయనో పెద్ద ఐరన్ లెగ్గు కూడా.

మంచు విష్ణు అస్త్రం.. దాసరి అరుణ్ కుమార్ మూవీ బ్యాంక్.. బ్లాక్ అండ్ వైట్.. ఎన్టీఆర్ శక్తి.. పవన్ కళ్యాణ్ పంజా.. ఇవీ ఇప్పటివరకూ జాకీ ష్రాఫ్ కనిపించిన తెలుగు సినిమాలు. అన్నీ ఆయా హీరోల కెరీర్ లో అప్పటివరకూ బడా ఫ్లాపులే. ఒకట్రెండు ఫ్లాపులకే ఐరన్ లెగ్ ముద్ర వేసే టాలీవుడ్.. జాకీ ష్రాఫ్ విషయంలో మాత్రం మళ్లీ మళ్లీ ఎందుకు ఛాన్సులిస్తున్నారో.. ఆయనలో అంత స్పెషాలిటీ ఏంటో అర్ధం కాని విషయం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...