బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇచ్చిన స్వామిరారా భామ! | Swamyraraa movie heroin's entry into Big Boss 2!

2-swamyraraa-movie-heroins-entry-into-Big-Boss-2

బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ ఇచ్చిన స్వామిరారా భామ! | Swamyraraa movie heroin's entry into Big Boss 2!

బిగ్ బాస్ 2కి పెట్టిన ట్యాగ్ లైన్ కు తగ్గట్లే సాగుతోంది. ఎంతచేసినా.. బిగ్ బాస్ 1కి వచ్చినంత ఆదరణ ఈ సీజన్ కు పెద్దగా రావట్లేదన్నది అందరూ ఒప్పుకుంటున్నదే. ఈ షోను పీక్స్ కు తీసుకెళ్లేందుకు చిత్ర విచిత్రంగా వ్యవమరిస్తున్న బిగ్ బాస్.. తాజాగా తీసుకున్న ఆసక్తికర అంశం ఈ షో గురించి మాట్లాడుకునేలా చేసింది.

ప్రతి వారం మాదిరి ఈ వారం ఎలిమినేషన్ అన్నది ఉండదని.. దాని స్థానే.. ప్రేక్షకుల ఓట్లతో ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించారు. దీంతో.. ఇప్పటికే ఎలిమినేట్ వారిలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే.. అన్ని ఆశలు అక్కర్లేదని.. ఎవరు హౌస్ లోకి రావాలో అప్పుడే డిసైడ్ అయ్యిందన్న విమర్శ వినిపించినా.. మరీ అంత పిల్లతరహాలో షోను నిర్వహించరన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. హౌస్ లోకి ఎవరిని తిరిగి తీసుకొస్తారో చూస్తే.. అంచనాలకు వాస్తవాలకు మధ్య తేడా తెలిసిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. సోమవారం అర్థరాత్రి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ నిద్ర పోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఊహించని మరో హౌస్ మేట్స్ వారితో జత కలిశారు. తమిళ.. మలయాళ.. తెలుగు చిత్రాల్లో నటించిన పూజా రామచంద్రంను ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె రాక విషయం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారికి ఇప్పటివరకూ తెలీదు.

అందరూ నిద్ర పోతున్నప్పుడు గుట్టుగా ఇంట్లోకి వచ్చేసిన ఆమె.. మిగిలిన వారికి సర్ ప్రైజ్ ఇవ్వనుంది. ఇంతకీ  పూజ రామచంద్రం ఎవరో గుర్తుందిగా. అవును.. స్వామిరారా.. అడవి కాచిన వెన్నెల.. దోచేయ్.. త్రిపుర లాంటి సినిమాల్లో నటించిన ఈ 34 ఏళ్ల భామ ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఇప్పటికే కాసింత నీరసంగా మారిన బిగ్ బాస్ 2ను పూజ ఎంతమేర రక్తి కట్టిస్తారో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...