హెబ్బా పటేల్.. 24 సార్లు పెట్టేసింది.. | Hebba Patel has been posted 24 times ..

Hebah-Patel-reveals-interesting-facts-about-24-kisses-movie-Andhra-Talkies.jpg

హెబ్బా పటేల్.. 24 సార్లు పెట్టేసింది.. | Hebba Patel has been posted 24 times ..

హెబ్బా పటేల్.. కుమారి 21F మూవీతో కుర్రాళ్ల మనసును కొల్లగొట్టిన హీరోయిన్.. అందం - గ్లామర్ కలగలిపిన ఈమె నటన చూసి అందరూ ఫిదా అయ్యారు. చలాకీదనంతో ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన హెబ్బాకు ఆ తర్వాత అవకాశాలు లేక సైడ్ అయిపోయింది. కుమారి 21F సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ ను అందుకోలేకపోయింది.

చాలా రోజుల తర్వాత మళ్లీ మనముందుకు వస్తుంది. అదీ కుర్రళ్లకు కాకపుట్టించే క్యారెక్టర్ తో.. అదిత్ అరుణ్ హీరోగా నటిస్తున్న ‘24 కిసెస్’ సినిమా లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటిస్తోంది. ఇందులో ఫ్రొఫెసర్ తో ప్రేమలో పడే మీడియా స్టూడెంట్ గా నటిస్తోంది. సినిమా పేరులో చెప్పినట్టే ఇందులో మొత్తం 24 లిప్ టు లిప్ ముద్దులను హెబ్బా పెడుతుందట.. ప్రతి ముద్దుకు ఓ లెక్క.. కారణం ఉంటుందట.. ఇంత రోమాంటిక్ క్యారెక్టర్ ను తాను చేయగలుగుతానా లేదా అని హెబ్బా మొదట్లో ఫీల్ అయ్యిందట.. కానీ కథ మొత్తం విన్నాక నమ్మకం కుదిరి చివరకు ఈ సినిమాలో నటించింది.. ముద్దులతో మురిపించింది.సినిమాకు పెట్టిన టైటిల్ ను బట్టి హీరో హీరోయిన్ల మధ్య 24 ముద్దులు ఓ సందర్భానుసారం వస్తాయట.  ఎంతో సృజానాత్మకంగా ఈ ముద్దు సీన్లు తీశామని చిత్రం యూనిట్ చెబుతోంది. ఇంతకుముందు చేసిన సినిమాల్లోనూ హెబ్బా ముద్దు సీన్లు చేసినా.. ఈ సినిమాలో మాత్రం కథ డిమాండ్ ప్రకారం ఈజీగా చేసేసిందట.. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే ఇక ముందు కూడా చేయడానికి రెడీ అంటోంది హెబ్బా.  ఈ 24 కిసెస్ సినిమాతో మళ్లీ పాత్ర క్రేజ్ తిరిగి తెచ్చుకుంటానని నమ్మకంతో ఉంది. ఇక ‘మిణుగురులు’ లాంటి క్లాసిక్ మూవీతో జాతీయ అవార్డు పొందిన అయోధ్య కుమార్ ‘24 కిసెస్’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...