ఎప్పుడూ అలాంటి పాత్రలేనా.. | Always have such a character ..

Hansika-Wants-Challenging-ROles-Andhra-Talkies.jpg

ఎప్పుడూ అలాంటి పాత్రలేనా.. | Always have such a character ..

అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది పాలబుగ్గల సుందరి హన్సికా మోత్వానీ. కాశ్మీర్ యాపిల్ లా ఉండే ఈ బ్యూటీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కొన్నాళ్లు తెలుగులోనే నటించినా పెద్దగా హిట్లేమీ రాలేదు. అదే టైంలో కాస్త బొద్దుగా మారింది. దాంతో రూటు మార్చి కోలీవుడ్ కు షిఫ్టయిపోయింది. అక్కడ వరస ఆఫర్లు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ అయింది.

ఈ మధ్య కాస్త సినిమాలకు విరామమిచ్చి బొద్దుగుమ్మ కాస్తా కష్టపడి ముద్దుగుమ్మలా తయారైంది. సినిమాలకు ఎందుకు గ్యాఫిచ్చింది అంటే ఒకే తరహా పాత్రలు చేసిచేసి బోర్ కొట్టేసింది అంటోంది హన్సిక. క్యూట్ గా.. బబ్లీగా కనిపిస్తూ చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు వేసే పాత్రలతో విసిగిపోయిందట. కెరీర్ లో ముందుకెళ్లాలంటే చేసే పాత్రల్లో మార్పు తప్పనిసరి అనిపించింది. అందుకే పాత్రలు ఛాలెంజింగ్ ఉంటేనే నటించడానికి ఒప్పుకుంటున్నా అంటోంది హన్సిక.


ఆమధ్య అరణ్మయి అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో నటించింది హన్సిక. ఆ తరవాత అలాంటి ఆఫర్లు 30 దాకా వచ్చాయి. ఇలాంటి స్టీరియో టైప్ స్క్రిప్టులు చేయాలని అనుకోకపోవడంతో రిజెక్ట్ చేసేశానని చెప్పుకొచ్చింది. ప్రస్త్తుతం విక్రమ్ ప్రభుతంతో తుపాకి మునై.. అధర్వతో 100 సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండూ ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలుల కావడంతోనే చేయడానికి అంగీకరించానని హన్సిక చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది లైఫిచ్చిన టాలీవుడ్ వైపు మాత్రం కన్నెత్తి చూడటమే మానేసింది. చెప్పుకొచ్చింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...