అతని వలనే అర్జున్ రెడ్డికి నో అనేసింది | Arjun Reddy did not know him

Janhvi-Kapoor-Was-First-Choice-For-Arjun-Reddy-Bollywood-Remake-Andhra-Talkies.jpg

అతని వలనే అర్జున్ రెడ్డికి నో అనేసింది | Arjun Reddy did not know him

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో బోల్డ్ సినిమాల ఒరవడి సృష్టించిన చిత్రం. సందీప్ వంగ దర్శకత్వం వహించిన మొదటి సినిమా గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవేరుకోండ - షాలిని పాండే ముఖ్య పత్రాలు పోషించారు. బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు అని తెలిసిన విషయమే. హిందీ వెర్షన్ ను కూడా సందీప్ దర్శకత్వం వహించటం విశేషమయితే - ఇందులో షాహిద్ కపూర్ - తార సుతారియా దీనిలో నటిస్తున్నారు.

ఈ సినిమా గురించి తొలుత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను అనుకున్నారు అనే ఒక వార్త ఇప్పుడు మీడియా లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం జాన్వీ ను అడగగా - శ్రీ దేవి కుటుంబానికి క్లోజ్ అయినా బాలీవుడ్ లో పేరు మోసిన డైరెక్టర్ కారం జోహార్ మొదట్లోనే బోల్డ్ సినిమాలు చేయొద్దని ఝాన్విను వారించాడట. బోల్డ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెడితే - అలాంటి ఇంప్రెషన్ వస్తుందని - అందుకని అది ఎంతమాత్రం మంచి ఆప్షన్ కాదని కరణ్ సూచించాడట. కరణ్ జోహార్ చెప్పటంతో జాన్వీ కూడా నో చెప్పిందంట. ఈమె కుదరదు అనేసరికి ఆ సినిమా దర్శకనిర్మాతలు తార సుతారియా ను తీసుకున్నారు.


జాన్వీ నటించిన మొదటి సినిమా ధఢక్ ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇషాన్ కట్టర్ కూడా ఈ సినిమా తోనే అరంగేట్రం చేయనున్నాడు. మరాఠీ భాషలో విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యిన సైరట్ సినిమాకు రీమేక్ లా ధఢక్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు  శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. 20 జులై న సినిమా విడుదల అవ్వనుండడంతో జాన్వీ - ఇషాన్ ఇద్దరూ ప్రొమోషన్లలో బిజీగా ఉన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...