నిహారికని దత్తత అడిగాడట!

asked-to-adopt-nomenclature

నిహారికని దత్తత అడిగాడట!

తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల జాబితా తీస్తే అందులో ప్రముఖంగా కనిపించే నటుడు మురళీశర్మ. తొలినాళ్లలో విలన్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన ఆయన ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతున్నాడు. స్వతహాగా తెలుగువారు కావడంతో భావోద్వేగాల్ని బాగా అర్థం చేసుకొంటూ ఆయా పాత్రల్లో ఒదిగిపోతున్నాడు. మొన్ననే వచ్చిన విజేతలో తండ్రిగా అదరగొట్టేశాడు. తాజాగా `హ్యాపీ వెడ్డింగ్`లోనూ అలాంటి బలమైన పాత్రే చేశాడట. భలే భలే మగాడివోయ్ నుంచి ఆయనకి మంచి పాత్రలు పడుతున్నాయి.  మురళీశర్మపై హ్యాపీవెడ్డింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రశంసల వర్షం కురిసింది.అతిథులంతా ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అల్లు అరవింద్ అయితే... మురళీశర్మకి ఎస్వీ రంగారావు పేరున ఉన్న అవార్డు ఇవ్వాల్సిందే అన్నారు. ప్రతి సినిమాలోనూ నరేష్ - ఆయన అదరగొడుతున్నారని ఆకాశానికెత్తేశారు. సినిమాలో కథానాయికగా నటించిన నిహారిక అయితే ఆయన వ్యక్తిత్వం గురించి కూడా గొప్పగా చెప్పింది. సెట్లో మురళీశర్మగారు తనని సొంత కూతురిలా చూసుకొన్నారని - నిన్ను దత్తత కూడా తీసుకొంటానని ఆయన నాతో చెప్పారని ఆమె వెల్లడించారు. ఆయనతో నటిస్తూ చాలా విషయాలు నేర్చుకొన్నానని - కొన్ని సన్నివేశాల్లో ఆయనతో కలిసి నటిస్తూ భోరున ఏడ్చేశానని చెప్పారు.  దీన్నిబట్టి సినిమాలో వీళ్లిద్దరి మధ్య మంచి ఎమోషన్సే పండుంటాయని అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...