బిగ్ బాస్ లో త్యాగమూర్తులు.. స్వార్థ పరులు | The Big Bass is the sacrifices-selfish

Bogg-Boss-2-Telugu-Telephone-Nomination-Episode-HighLights-Andhra-Talkies.jpg

బిగ్ బాస్ లో త్యాగమూర్తులు.. స్వార్థ పరులు | The Big Bass is the sacrifices-selfish

బిగ్ బాస్ 2 సోమవారం  ఎపిసోడ్  కేక పుట్టించింది. ఈ ఒక్క రోజు.. మంచోడు.. చెడ్డోడు అయిపోయాడు.. పనికిరారని ముద్రపడ్డ వారు హీరో అయిపోయారు.  త్యాగశీలతను చాటిచెప్పే టాస్క్ ఇచ్చి బిగ్ బాస్ ఇంటిసభ్యులందరిలోని మానవీయతను బయటకు తీశాడు. హౌస్ లో ఇన్నాళ్లు కొట్టుకున్నా.. తిట్టుకున్న ఇంటిసభ్యుల నిజాయితీని ఈ టాస్క్ తో నిరూపించాడు. సోమవారం టెలిఫోన్ బూత్ టాస్క్ లో తమ తోటి స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి ముందుకు వచ్చిన ఇంటిసభ్యుల తీరు ప్రశంసలు అందుకుంది.

సోమవారం ఇంటిసభ్యులందరినీ బిగ్ బాస్ ఎలిమినేషన్ జోన్ లోకి పంపాడు. అందులోంచి బయటకు రావాలంటే మరో కంటెస్టెంట్ సాయం తీసుకోవాల్సిందిగా టాస్క్ ఇచ్చాడు. ఒకరి కోసం మరొకరు ఏమైనా త్యాగం చేస్తే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చన్నమాట. 

గణేష్ ని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి బాబు గోగినేని రెండు కొత్తిమీర కట్టలను తినాల్సి వచ్చింది. ఇక తేజస్విని కాపాడడానికి సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకున్నాడు. గీతామాధురిని రక్షించడానికి తేజస్వి తనకు ఎంతో ఇష్టమైన తెల్ల దుప్పటిని పనికిరాకుండా ముక్కలుగా కట్ చేసింది.  రోల్ రైడా తన జుట్టుకు ఎరుపురంగు పూసుకున్నాడు. 

ఇలా ఒకరిని కాపాడడానికి మిగిలిన వారు ఏదో ఓ త్యాగం చేసి శభాష్ అనిపించుకున్నారు. కానీ కౌశల్ - అమిత్ తివారీ మాత్రం త్యాగాలకు సిద్ధపడకపోవడంతో దీప్తి నల్లమోతు - భానుశ్రీలు ఎలిమినేషన్ లో పడ్డారు. 

ఇలా సోమవారం ఎవరికి ఏ టాస్క్ ఇస్తారో.. దాన్ని వాళ్లు ఎలా స్వీకరిస్తారనే భయం అందరిలోనూ వెంటాడింది. తమ స్నేహితులను కాపాడడానికి కొంత మంది కఠినమైన టాస్క్ లు కూడా చేసి త్యాగం-ప్రేమకు నిజమైన నిర్వచనం ఇచ్చారు.  ఈ టాస్క్ లలో అందరూ త్యాగాలకు సిద్ధపడగా.. ఒక్క అమిత్ కౌశల్ లు మాత్రమే వెనుకంజ వేశారు. ఈ పరిణామాలతో రాబోయే ఎపిసోడ్లలో మరింత డ్రామా పండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...