బిగ్ బాస్ బిగ్ స్కాం?: తేజస్వి తండ్రి సంచలన వ్యాఖ్యలు | Big Boss Big Scam ?: Tejasvi's father's sensational comments

Actor-Tejaswi-Father-Sensational-Comments-on-Bigg-Boss-andhra-talkies.jpg

బిగ్ బాస్ బిగ్ స్కాం?: తేజస్వి తండ్రి సంచలన వ్యాఖ్యలు | Big Boss Big Scam ?: Tejasvi's father's sensational comments

బిగ్ బాస్ 1కి భిన్నమైన పరిస్థితి బిగ్ బాస్ 2లో కనిపిస్తోంది. ఏమైనా జరగొచ్చన్న ట్యాగ్ లైన్ తో సాగుతున్న ఈ షోలో వివాదాలకు కొదవ లేదన్నట్లుగా సాగుతోంది. హౌస్ మేట్స్ మధ్యనున్న కోట్లాటలు ఒక ఎత్తు అయితే.. బిగ్ బాస్ అనుసరిస్తున్న తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని రీఎంట్రీ ఇచ్చేందుకు జరిపిన ఓటింగ్ ప్రక్రియ భారీ సక్సెస్ అయినట్లుగా బిగ్ బాస్ చెప్పుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ పబ్లిక్ పోల్ లో తనకు భారీగా ఓట్లు నమోదు అయ్యేలా చూసేందుకు తేజస్వి చాలానే ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు.

తన పీఆర్ సాయంతో మళ్లీ హౌస్ లోకి వెళ్లాలని చూసిన తేజస్వి ఇందుకు భారీగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. పబ్లిక్ లో ఆమెపైన ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమెకు ఓట్లు సరిగా నమోదు కాలేదని చెబుతున్నారు. తొలుత ఒక్కరినే రీఎంట్రీ ఇవ్వాలని భావించినా.. వచ్చిన ఓట్లు భారీగా ఉండటం.. శ్యామల.. నూతన్ నాయులకు వచ్చిన ఓట్లతో బిగ్ బాస్ టీం ఆలోచనలో పడి ఇద్దరిని రీఎంట్రీ ఇప్పించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే. ఇద్దరిని రీఎంట్రీ ఇవ్వాలన్న నిర్ణయం వెనుక మరో కారణం ఉందన్న మాట వినిపిస్తోంది.  ఒకరితో రీఎంట్రీ ఇప్పించే పక్షంలో తేజస్వి హౌస్ లోకి వెళ్లే అవకాశం లేదని.. అందుకే.. ఇద్దరితో ఇప్పించాలన్న నిర్ణయానికి వచ్చారని.. కానీ పోలైన ఓట్లలో తేజస్వి మూడో స్థానం కూడా దక్కలేదన్న మాట వినిపిస్తోంది.

తేజస్విని మరో అవకాశం ఇచ్చేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేసినా.. కౌశల్ ఆర్మీ నూతన్ నాయుడికి సపోర్ట్ చేసిందని చెబుతున్నారు. శ్యామల విషయంలో సింపతీ వర్క్ వుట్ అయ్యిందని.. అదే ఆమెకు శ్రీరామరక్షగా మారిందని చెబుతున్నారు.

ఇక.. బయటకు వచ్చిన తర్వాత తేజస్వి ఇచ్చిన స్టేట్ మెంట్లు.. టీవీ ఇంటర్వ్యూలు సైతం ఆమెకు ప్రతికూలంగా మారినట్లు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే.. తేజస్వి తండ్రి బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో పెద్ద స్కాంగా ఆయన ఆరోపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఆక్షన్ పెట్టారని ఆరోపించారు. ఇంతకాలం తేజస్విని ప్రమోట్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించిన బిగ్ బాస్ మీదనే ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో షో నిర్వాహకులు.. నాని ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...