అమితాబ్ యాడ్ పై వివాదం | Controversy over Amitabh Ad

controversy-over-amitabh-ad

అమితాబ్ యాడ్ పై వివాదం | Controversy over Amitabh Ad

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ఓ ప్రకటన వివాదాస్పదమైంది. తెలుగులో అక్కినేని నాగార్జున ప్రచారం చేసే కళ్యాణ్ జువెలర్స్ కు హిందీలో బిగ్-బి ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ జువెలరీ బ్రాండ్ మీద ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చాయి. దుబాయ్లోని కళ్యాణ్ జువెలర్స్ షోరూంలో నకిలీ బంగారం అమ్మినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది ఆ సంస్థ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించేందుకు కళ్యాణ్ జువెలర్స్ ఒక కొత్త ప్రకటన రూపొందించింది. తమ క్రెడిబిలిటీ ఎలాంటిదో చాటి చెప్పేందుకు ప్రయత్నం చేసింది. ఈ ప్రకటనలో అమితాబ్తో పాటు ఆయన తనయురాలైన శ్వేత నందా నటించారు.
ఈ ప్రకటనలో భాగంగా అమితాబ్ - ఆయన తనయురాలు ఒక బ్యాంకుకు వెళ్తారు. తన పెన్షన్ అమౌంట్ రెండుసార్లు తన బ్యాంక్ అకౌంటులో క్రెడిట్ అయిందంటూ అమితాబ్ బ్యాంకు సిబ్బందికి చెబుతాడు. అందుకు బదులుగా బ్యాంకు సిబ్బంది.. ఈ విషయం బయటికి చెప్పకుండా డబ్బులు అలాగే ఉంచేసుకోమని సలహా ఇస్తారు. దీనికి అమితాబ్ అంగీకరించరు. కళ్యాణ్ జువెలర్స్ వాళ్లు కూడా ఇంత నిజాయితీగా ఉంటారంటూ చాటిచెబుతూ ఈ యాడ్ ముగుస్తుంది. ఐతే కళ్యాణ్ జువెలర్స్ గురించి గొప్పలు పోయే క్రమంలో బ్యాంకు సిబ్బందిని తప్పుగా చూపించారంటూ గొడవ మొదలైంది. బ్యాంకింగ్ యూనియన్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ప్రకటనను తీసేయాలని డిమాండ్ చేసింది. దీనిపై కళ్యాణ్ జువెలర్స్ సంస్థ కూడా స్పందించింది. ప్రకటనలో మార్పులు చేస్తామని పేర్కొంది.

1 comment:

  1. అమితాభ్ పాత్ర తెలుగులో నాగార్జున వేసినట్లున్నాడు. ప్రతి చిన్నదానికీ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ రాజకీయం చేసే ఈ రోజుల్లో ఈ ప్రకటన బేంక్ ల వారికి తప్పకుండా అభ్యంతరకరమే. ముఖ్యంగా ఆ బేంక్ మేనేజర్ మాట్లాడినది మరీ అభ్యంతరకరం. కళ్యాణ్ జూయలర్స్ ను, ఆ మోడల్ ను ఏదో గొప్పగా చిత్రీకరించాలనే తాపత్రయమే ప్రముఖంగా కనిపిస్తోంది. మార్పులు చేస్తామంటున్నారు గానీ అసలు మొత్తం ప్రకటననే తీసేసి ఫ్రెష్ గా కొత్తది తయారు చేసుకోవాలి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...