కొడుకు కోసం కాళ్ల మీద పడ్డాడా? | Did the son fall on the legs?

Rishi-Kapoor-fell-on-the-feet-of-Rajkumar-Hirani-mom-to-cast-his-son-Ranbir-Andhra-Talkies.jpg

కొడుకు కోసం కాళ్ల మీద పడ్డాడా? | Did the son fall on the legs?

రిషి కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో. ఇప్పుడు ఆయన తనయుడు రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ లో ఓ అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నాడు. `సంజు`తో ఇటీవలే రణ్ బీర్ ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు.  సూపర్  టాలెంటెడ్ నటుడే అయినా కొంతకాలంగా రణ్ బీర్ కి సరైన సినిమాలు పడలేదు. దాంతో చాలా సినిమాలు డిజాస్టర్లు అయిపోయాయి. ఆ రకంగా కష్టాల్లో ఉన్న రణ్ బీర్ కి సంజు కొండంత ఉత్సాహాన్నిచ్చింది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఆ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే ఒక ఉత్తమమైన బయోపిక్ అని కొద్దిమంది వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమా వెనక రణ్ బీర్ తండ్రి రిషికపూర్ పాత్ర చాలా ఉందట.

అసలు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రణ్ బీర్ నటించడానికి కారణం రిషికపూరేనట. తన కొడుకు కెరీర్ ణి గుర్తించి ఒక రోజు హిరాణీ ఇంటికి వెళ్లాడట రిషికపూర్. అక్కడ హిరాణీ తల్లి కాళ్లపై పడ్డాడట. రణ్ బీర్ తో సినిమా చేయమని మీ అబ్బాయికి చెప్పండని అడిగారట. మరి అందులో నిజమెంతో తెలియదు కానీ... బాలీవుడ్ వర్గాలు ఆ విషయం గురించి చర్చించుకొంటున్నాయి.రాజ్ కుమార్ హిరాణీ బాలీవుడ్ లో ఓ అగ్ర దర్శకుడు. ఆయన మున్నాభాయ్ సీక్వెల్ చిత్రాలతో అదరగొట్టాడు. త్రీ ఇడియట్స్ కూడా ఆయన తీసిందే.  అత్యుత్తమ దర్శకుడిగా పేరు గాంచిన హిరాణీతో పనిచేయాలని ప్రతి స్టార్ హీరో కోరుకొంటాడు. అందుకే ఆయనైతేనే తన కొడుకు కెరీర్ ని మళ్లీ గాడిలో పెడతాడని భావించిన రిషి కపూర్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేసి  సఫలమైనట్టు ప్రచారం సాగుతోంది. అయితే `సంజు` చూస్తే అందులో రణ్ బీర్ కపూర్ ఒదిగిపోయినట్టు మరే కథానాయకుడూ ఒదిగిపోలేడనేది మాత్రం సుస్పష్టం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...