యన్.టి.ఆర్’ షూటింగుకి ఎవరొచ్చారో తెలుసా? | Do you know what NTR shoots are?

Ramoji-Rao-Visits-NTR-Biopic-Sets-Andhra-Talkies.jpg

యన్.టి.ఆర్’ షూటింగుకి ఎవరొచ్చారో తెలుసా?

తెలుగు సినిమాపై.. తెలుగు రాజకీయాలపై తిరుగులేని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు జీవిత కథతో ‘యన్.టి.ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం రామోజీ పిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా చిత్రీకరణ జరుగుతున్న చోటికి ఒక విశిష్ట అతిథి వచ్చారు. ఆయన మరెవరో కాదు.. ఫిలిం సిటీ అధినేత.. మీడియా మొఘల్ రామోజీ రావు.  ఆయన అరగంట పాటు అక్కడే ఉండి సినిిమా విశేషాలు తెలుసుకున్నారట.


ఈ చిత్రంలో రామోజీ పాత్ర కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. క్రిష్ ఈ సందర్భంగా సినిమాలో ఆయన పాత్ర గురించి కూడా వివరించినట్లు చెబుతున్నారు. రామోజీ కూడా క్రిష్ కు కొన్ని సలహాలు ఇచ్చారట. రాజకీయంగా  ఎన్టీఆర్ ఎదుగుదలలో రామోజీ రావుది కూడా కీలక పాత్ర. ఆయన ఆధ్వర్యంలోని ఈనాడు పత్రిక ఎన్టీఆర్ కు తిరుగులేని మద్దతు ఇచ్చింది. ఆయనకు గొప్ప కవరేజీ ఇచ్చి.. జనాలు ఆయన వైపు మళ్లేలా వార్తలు.. కథనాలు ఇచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనకు అండగా నిలిచారు రామోజీ. మరి ‘యన్.టి.ఆర్’ సినిమాలో రామోజీ పాత్రను ఎవరు పోషిస్తారు.. ఈ పాత్రను సినిమాలో ఎలా.. ఎంత వరకు చూపిస్తారన్నది ఆసక్తికరం.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...