శ్రీదేవిని సాగనంపిన మరుసటి రోజే!

Jhanvi-Kapoor-Experience-With-Working-Of-Dhadak-Andhra-Talkies.jpg

శ్రీదేవిని సాగనంపిన మరుసటి రోజే

తల్లి చనిపోవడంతో తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని `ధఢక్` సినిమా చిత్రీకరణలో పాల్గొంది శ్రీదేవి కూతురు జాహ్నవి. ఆ చిత్రంలో ఆమె నటించిన తీరు ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పిస్తోంది. శ్రీదేవిని మళ్లీ ఆమె కూతురు జాహ్నవిలో చూసుకొంటున్నామనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు చాలామంది ప్రేక్షకులు. అయితే తాజాగా ఒక  ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది జాహ్నవి.

శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే జాహ్నవికి షూటింగ్ ఉందట. కాకపోతే ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసినట్టు చెప్పారట. కానీ జాహ్నవి మాత్రం నేను సెట్లో ఉండుంటే బాగుండేదని అనుకొందట. అంతటి విషాదంలోనూ ఆమె సెట్ కి వెళ్లాలని - నటించాలని అనుకొన్నారట.  అమ్మ లేని విషయాన్ని అలాగైనా మరిచిపోవాలనేది ఆమె అభిమతం కావొచ్చు. ``నిజంగా ధఢక్ సినిమా లేకపోతే  నేనేమైపోయేదాన్నో. నా మైండ్ ని మొత్తం పోగొట్టుకొనేదాన్ని. ఆ సినిమా వల్లే నేను అమ్మ దూరమైన విషయాన్ని మరిచిపోయే ప్రయత్నం చేశా`` అని చెప్పుకొచ్చింది జాహ్నవి. ప్రస్తుతం తన తొలి చిత్రం ధడక్ విజయాన్ని ఒక పక్క ఆస్వాదిస్తూనే.. మరోపక్క తన తల్లి జ్ఞాపకాల్ని నెమరేసుకొంటూ భావోద్వేగానికి గురవుతోంది జాహ్నవి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...