బిగ్ బాస్ లోకి రాజమౌళి! | Rajamouli into Big boss!

Kaushal-Targets-Babu-Gogineni-With-Rajamouli-In-Bigg-Boss-House.jpg

బిగ్ బాస్ లోకి రాజమౌళి! | Rajamouli into Big boss!

బిగ్ బాస్ హౌస్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అదే సమయంలో.. హౌస్ లో లేని వారికి సంబంధించిన చర్చ ఒకటి తెర మీదకు రావటమే కాదు.. దీనిపై ఇద్దరు హౌస్ మేట్స్ మధ్య మాటలు రావటమే కాదు.. తీవ్రస్థాయికి చేరటం ఆసక్తికరంగా మారింది. ఒక ప్రముఖుడిని కించపరిచేలా మరో ప్రముఖుడు విమర్శలు చేయటం ఎంతవరకు సబబు? అన్న ప్రశ్న ఒక ఎత్తు అయితే.. సదరు ప్రముఖుడు తమలాంటి వారందరికి పెద్ద అంటూ కౌశల్ చేసిన ఆవేశపు వాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ వారం ఎలిమినేషన్ కార్యక్రమంలో భాగంగా ఒక టాస్క్ అప్పజెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఒక్కో హౌస్ మేట్.. తనకు నచ్చని ఇద్దరు హౌస్ మేట్స్ నెత్తిన కోడిగుడ్డును పగలకొట్టాలి. అదే సమయంలో.. అందుకు కారణం చెప్పాలి.

ఊహించినట్లే ఎక్కువమంది హౌస్ మేట్స్ కౌశల్ ను టార్గెట్ చేశారు. అతడిపై పలువురు పలు ఆరోపణలు చేశారు. అందరి కంటే ఎక్కువగా నందిని చేసిన కామెంట్స్ కౌశల్ భారీగా హర్ట్ అయినట్లుగా కనిపించింది. ఇదిలా ఉండగా.. హౌస్ మేట్స్ మీద గుడ్లు పగలగొట్టే అవకాశం కౌశల్ కు వచ్చింది.

ఈ సందర్భంగా తన మీద విమర్శలు చేసిన వారికి సమాధానం ఇచ్చే క్రమంలో దిగ్గజ దర్శకుడు జక్కన్నగా సుపరిచితుడైన రాజమౌళి ప్రస్తావనను తీసుకొచ్చారు. రాజమౌళి లాంటి ప్రముఖ దర్శకుడిపై బాబు గోగినేని చేస్తున్న వ్యాఖ్యలు సరిగా లేవని.. రాజమౌళి గురించి బాబు తప్పుగా మాట్లాడరని.. అందుకే నామినేట్ చేస్తున్నట్లు చెప్పి ఆయన నెత్తి మీద గుడ్డు పగలగొట్టారు.

బాబు ఎంత నాస్తికుడైతే మాత్రం.. మరో వ్యక్తి వ్యక్తిగత అంశాల్ని ఎలా చర్చిస్తారంటూ ప్రశ్నించిన కౌశల్.. రాజమౌళి దేశంలోనే గర్వించదగ్గర దర్శకుడని.. అలాంటి వ్యక్తి తెలుగువాడు అయినప్పుడు ఆయన్ను తక్కువ చేసేలా మాట్లాడితే ఒప్పుకోనన్నారు. తాను కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినేనని.. తమకు రాజమౌళి దేవుడితో సమానమని.. అలాంటి వ్యక్తిని తప్పుగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించటమే కాదు..అలా చేయటం తప్పు అని తేల్చి చెప్పారు. కౌశల్ ను అందరూ టార్గెట్ చేసిన వేళలో.. అతగాడు మాత్రం అందుకు భిన్నంగా రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చి.. పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...