బిగ్ బాస్ లో శృతి హంగామా.. | Shruti Hungama in Big Boss

Shruti-Haasan-Joins-With-Kamal-Haasan-in-Bigg-Boss-2-Tamil-Andhra-Talkies.jpg

బిగ్ బాస్ లో శృతి హంగామా.. | Shruti Hungama in Big Boss

బాలీవుడ్ బిగ్ బాస్ ఇప్పటికే అన్ని భాషల వారికి చాలా దగ్గరైపోయింది. నార్త్ జనాలతో పాటు ఈ రియాలిటీ షోకి సౌత్ జనాలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. ఇకపోతే తెలుగులో ఓ లెవెల్లో ఉంటే కోలీవుడ్ లో మాత్రం మరో లెవెల్లో ఉంది. ఏకంగా కంటెస్టెంట్స్ మధ్య లిప్ లాక్ లు సాగుతున్నాయి అంటే డోస్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ తమిళ్ బిగ్ బాస్ షోకి కమల్ హాసన్ హోస్ట్ గా బాగానే రాణిస్తున్నారు.

అసలు విషయంలోకి వస్తే.. బిగ్ బాస్ రీసెంట్ ఎపిసోడ్ లో లోకనాయకుడి కూతురు కూడా శ్రుతిహాసన్ హసన్ కూడా మెరిసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విశ్వరూపం 2 సినిమా యొక్క పాటలను షోలో రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. అంతే కాకుండా కమల్ శృతిహాసన్ తో కలిసి నానగియా అనే పాటను పాడారు. వారితో పాటు ఆడియెన్స్ కంటెస్టెంట్స్ విజిల్స్  అండ్ క్లాప్స్ తో షోకి ఉపునుతెచ్చారు. పాటల గురించి వివరించిన అనంతరం శ్రుతిహాసన్ తండ్రి గురించి మాట్లాడారు.రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికి సినిమాలకు ఎండ్ చెప్పకూడదు అని కమల్ ని చాలా మంది సెలబ్రెటీలు కోరుతున్నారు. అలాగే శ్రుతిహాసన్ కూడా తండ్రిని కోరింది. సినిమాలకు స్వస్తి చెప్పే ఆలోచన మానుకోవాలని చెప్పడంతో అందరూ శ్రుతికి మద్దతు పలికారు. కమల్ కూడా నవ్వుతూ.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమను యువ నటీనటులు ముందుకు తీసుకెళ్లేందుకి శ్రమించాలని చెప్పారు. ఇక షో వేదికపై శ్రుతి హుషారుగా కనిపించి అందరితో మాట్లాడింది. వారి ప్రశ్నలన్నటికి కూడా ఆమె ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...