కాజల్ చుట్టూనే కథ అంతా! | The story around Kajal

Kajal-Playing-Key-Role-in-Bellamkonda-Srinivas-and-Teja-Film-Andhra-Talkies.jpg

కాజల్ చుట్టూనే కథ అంతా! | The story around Kajal


నేనే రాజు.. నేనే మంత్రి సినిమా తర్వాత దర్శకుడు తేజ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కు దర్శకత్వం వహించే అద్భుత అవకాశాన్ని దక్కించుకున్నాడు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఇంత పెద్ద ప్రాజెక్టు తన వల్ల కాదంటూ తప్పుకున్న సంగతి తెలిసిందే.. ఇక అప్పటినుంచి తేజ ఏం సినిమా మొదలు పెడుతాడా అన్న ఆసక్తి నెలకొంది..

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా  తేజ ఓ సినిమాను మొదలు పెట్టాడు. కాజల్ కథానాయికగా నటిస్తోంది. బెల్లంకొండతో పోలిస్తే కాజల్ సీనియర్ హీరోయిన్. అయినా తేజ ఆమెనే తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉందట..

తేజ తాజా సినిమా లేడీ ఓరియెంటెడ్ కథ అట. అందుకే కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నట్టు తెలిసింది. కథంతా కాజల్ చుట్టూ తిరుగుతుందని.. బెల్లంకొండ పాత్ర ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తాడని సమాచారం.దర్శకుడు తేజ యమస్ట్రిక్ట్. ఆయన సినిమాల్లో నటించడం నటీనటులకు ఓ సవాల్. హీరోల్లోని కొత్త కోణాలను ఆయన ఆవిష్కరిస్తుంటాడు. ఇప్పటికే డ్యాన్సులు - ఫైట్లలో రాణించిన బెల్లంకొండ నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. మరి తేజతో ఈ హీరో ఎలా ముందుకెళ్తాడని ఆసక్తిగా మారింది.

ఈ సినిమా టైటిల్ గా ‘సావిత్రి’ లేదా ‘సీత’ను పరిశీలిస్తున్నాడట తేజ. ఈ రెండు టైటిళ్లతో ఇదివరకే సినిమాలొచ్చేశాయి. దీంతో మరో పురాణాల్లోని పవర్ ఫుల్ స్త్రీ పాత్రను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టే ఆలోచనలో తేజ ఉన్నట్టు సమాచారం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...