తన పెళ్లి వార్తలపై సునీత క్లారిటీ! | Sunita Clarity on her wedding news

sunita-clarity-on-her-wedding-news

తన పెళ్లి వార్తలపై సునీత క్లారిటీ! | Sunita Clarity on her wedding news

టాలీవుడ్ సింగర్ సునీత గురించి  ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే సునీత పెళ్లికూతురు కాబోతోందని - ఓ టెకీని సునీత వివాహం చేసుకోబోతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఈ వార్తలపై తాజాగా సునీత .... ఫేస్ బుక్ లైవ్ చాట్ లో ఘాటుగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపైనే ఎక్కువ ఆసక్తిని ఎందుకు చూపిస్తారంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలను సునీత ఖండించారు. ఆ పుకార్లు అర్థ రహితమని - వాటిని ఎందుకు సృష్టిస్తారో తనకు అర్థం కాదని మండిపడ్డారు. తానెవరినీ పెళ్లి చేసుకోవడం లేదని....కొన్ని వెబ్ సైట్లు - సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లకు అడ్డుకట్ట వేసేందుకే ఫేస్ బుక్ లైవ్ కు వచ్చానని సునీత క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తన పెళ్లి గురించి మాట్లాడేందుకు సమయం కాదని...సందర్భం అంతకన్నా కాదని సునీత అన్నారు. నెల రోజుల క్రితమే తన నాయనమ్మ చనిపోయారని - ప్రస్తుతం ఆ పనుల్లో తాను తీరిక లేకుండా ఉన్నానని అన్నారు. అందువల్లే ఆ పుకార్లపై స్పందించడానికి కొంత సమయం పట్టిందని చెప్పారు. కానీ గత రాత్రి నుంచి తనకు చాలామంది ఫోన్ చేసి ఈ పెళ్లి గురించి అడుగుతున్నారని....శుభాకాంక్షలు చెబుతూ చాలా మెసేజ్ లు కూడా వస్తున్నాయని సునీత అన్నారు. అందుకే ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చేందుకు ఫేస్ బుక్ లైవ్ కు వచ్చానని చెప్పారు. అయితే తాను మళ్లీ చేసుకొని సంతోషంగా ఉండాలని ఇంతమంది మిత్రులు - సన్నిహితులు కోరుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని - భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే  స్వయంగా తానే ప్రకటిస్తానని చెప్పారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...