వ్యభిచారం చేస్తూ దొరికిన భోజ్ పురి నటి ఎక్కడంటే? | Where is Bhoj Puri actress doing adultery?

Hyderabad-cops-rescue-Bhojpuri-actress-in-high-profile-sex-racket-Andhra-Talkies.jpg

వ్యభిచారం చేస్తూ దొరికిన భోజ్ పురి నటి ఎక్కడంటే?

తరచూ హైటెక్ వ్యభిచార రాకెట్లు బయటపడే హైదరాబాద్ లో శనివారం రాత్రి చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడే పరిణామం చోటు చేసుకోవటం తెలిసిందే. తెలుగు నేలకు దగ్గర్లోని మహారాష్ట్రకు చెందిన భోజ్ పురికి చెందిన ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా పేరున్న ఒక నటి హైదరాబాద్ లోని స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వైనం తెలిసిందే.

బంజారాహిల్స్ లోని స్టార్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు హోటల్ పై దాడి చేసి.. నటితో పాటు విటుడ్ని.. సంధానకర్తగా వ్యవహరించిన బ్రోకర్ జనార్దన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి నుంచి మొబైల్ ఫోన్స్.. రూ.40వేలమొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల అదుపులో ఉన్న సినీ నటిని తాజాగా హైదరాబాద్ లోని రెస్య్కూహోంకు తరలించారు. మిగిలిన ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ ఒక తెలుగు నటి ఇదే ఆరోపణ మీద పోలీసులకు దొరికిపోవటం.. కొంతకాలం రెస్య్కూహోంలో ఉండటం తెలిసిందే. అయితే.. తానేం తప్పు చేయలేదని.. తనను ఇరికించినట్లుగా సదరు నటి వాపోయింది. మరి.. భోజ్ పురి నటి వాదన మాత్రం బయటకు రాలేదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...