'ఎన్టీఆర్' లో నటించడం గొప్ప అనుభూతి:విద్యా బాలన్

Very-excited-about-NTR-biopic--says-Vidya-Balan-Andhra-Talkies.jpg

'ఎన్టీఆర్' లో నటించడం గొప్ప అనుభూతి:విద్యా బాలన్

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా `ఎన్టీఆర్ `బయోపిక్ తెరెకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ నటిస్తూ సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న `ఎన్టీఆర్ `లో కీలక పాత్రల కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోని ప్రముఖ నటులను ఏరికోరి ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్`సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తోంది. తొలిసారిగా తెలుగులో నటిస్తోన్న విద్యాబాలన్ కు....బాలకృష్ణ కుటుంబం సాదర ఆహ్వానం పలికి చీర కూడా బహూరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ పై తొలిసారిగా విద్యాబాలన్ స్పందించింది. ఈ చిత్రంలో నటించడం ఓ గొప్ప అనుభూతని చెప్పింది. చిత్ర యూనిట్ చాలా బాగా ప్రొఫెషనల్ గా పనిచేస్తోందని అభిప్రాయపడింది. `మాల్టా` ఫిల్మ్ ఫెస్టివల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపకైన విద్యాబాలన్....మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను గతంలో ఓ రెండు మలయాళ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించానని తొలిసారిగా తెలుగులో నటిస్తున్నానని చెప్పింది. ఇప్పటివరకు తాను హిందీలోనే డైలాగులు చెప్పానని తొలిసారిగా తెలుగులో డైలాగులు చెబుతున్నానని తెలిపింది. ఈ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభూతి అని తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్ జరుగుతోందని ఇప్పటివరకు 5 రోజులు షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. చిత్ర యూనిట్ టీం అంతా తనకు సహకరిస్తున్నారని....ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారని కితాబిచ్చింది. మాల్టా ఫిల్మ్ ఫెస్టివల్ వల్ల బాలీవుడ్ చిత్రాలకు మరింత ప్రాముఖ్యత దక్కుతుందని....రెండు దేశాల మధ్య మరిన్ని అవకాశాలకు ఈ తరహా ఫెస్టివల్స్ ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...