అల్లు అరవింద్ నైరాశ్యంలోకి వెళ్లి ఇండస్ట్రీని వదిలేస్తాన్నాడట! | Allu Aravind went into the state of negligence and left the industry!

Allu-Aravind-Upset-with-Geetha-Govindam-Leakage-Andhra-Talkies.jpg

అల్లు అరవింద్ నైరాశ్యంలోకి వెళ్లి ఇండస్ట్రీని వదిలేస్తాన్నాడట! | Allu Aravind went into the state of negligence and left the industry!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా కొనసాగుతున్నాడు అల్లు అరవింద్. ఇప్పటికీ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. యువ నటీనటులు.. దర్శకులతో సినిమాలు చేస్తూ.. మంచి విజయాలు అందుకుంటూ సాగిపోతున్నారాయన. మున్ముందు ఆయన నుంచి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. అలాంటి నిర్మాత ఇటీవల సినీ రంగాన్ని వదిలేయాలన్న నైరా శ్యంలోకి వెళ్లారట. అందుక్కారణం ‘గీత గోవిందం’ సినిమా పైరసీ బారిన పడటమేనట. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందే ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆవేదనతో ఇండస్ట్రీకి దూరం కావాలనుకున్నారట.

ఈ విషయాన్ని మరో అగ్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించాడు. రెండు రోజుల కిందట తనకు అల్లు అరవింద్ ఫోన్ చేసి ఇండస్ట్రీని వదిలిపోవాలన్నంత బాధ కలుగుతోందని అన్నట్లు రాజు చెప్పాడు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన అలాంటి మాట అనడం తనకెంతో ఆవేదన కలిగించిందని రాజు చెప్పాడు. ఐతే తామంతా మీ వెనుక ఉన్నామని చెప్పి అరవింద్ కు ధైర్యం చెప్పానన్నాడు. తామందరికీ సినిమా అంటే ప్రాణం అని.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సినిమాలు తీసే నిర్మాతలకు అన్యాయం చేయొద్దని రాజు కోరాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని.. ఆ తప్పు చేసిన వాళ్లే పైరసీని ఆపాలని.. ఇది విజ్నప్తి అనుకున్నా.. హెచ్చరిక అనుకున్నా పర్వాలేదని రాజు అన్నాడు.

1 comment:

 1. పైరసీ అనేది తప్పు కాదని ఎవరూ అనరు.
  సినిమా నిర్మాతలూ దర్శకులూ తమతమ సినిమాలు పైరసీ బారిన పడటం గురించి ఆవేదన వ్యక్తం చేయటం తరుచుగా జరుగుతూ ఉంటుంది.
  సినిమా ప్రింటును కాపీకొట్టి పంచితేనే పైరసీ అన్న మాట వర్తిస్తుందా?
  హాలీవుడ్ నుండి సినిమాల కథలను (కొండొకచో పాటల బాణీలను కూడా) సినిమాల వాళ్ళు నిస్సిగ్గుగా కాపీచేసేస్తూ ఉంటారు. కనీసం తమ కథకు ఫలాని సినిమా ఆథారం అనో స్ఫూర్తి అనో ప్రకటించిన పాపాన ఎవ్వరూ పోరు. అది మాత్రం పైరసీ కాదా? దానికి సినిమాలవాళ్ళు దోషులు కారా? వీళ్ళ కాపీ సినిమాలకు మరొకడు ప్రింట్ కాపీ తీస్తే అది మాత్రం వీళ్ళ సోకాల్డ్ సృజనాత్మకకళావ్యాపారం పైన దాడీ దొంగతనమూ అవుతుందా? ఆలోచించండి.
  తెలుగుసినిమా స్వర్ణయుగం రోజుల్లో ఫలాని కథకు/నవలకు సినిమా అనుసరణ అని చెప్పి తెర మీద ప్రకటించేవారు చాలా సినిమాల్లో. ఈరోజుల్లో కథాచౌర్యాలు చేసి మరీ సినిమాలు తీస్తున్నారు - ఆ పిమ్మట ఆరచయితలు గోలపెట్టటాలూ కోర్టుకెక్కటాలూను. ఐతే, ఇంతోటి నకీలీకళాఖండాలకు మాత్రం మరెవరూ అన్యాయపు కాపీలు తీయకూడదని గోల ఒకటి, ఈ మహా నిర్మాతలూ దర్శకుల ఆవేదనలొకటి. బాగుంది. బాగుంది.

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...