బిడ్డకు తల్లి పాలిస్తున్నా విమర్శలేనా?

Lisa-Haydon-recalls-how-she-was-trolled-for-her-breastfeeding-picture-Andhra-Talkies.jpg

బిడ్డకు తల్లి పాలిస్తున్నా విమర్శలేనా?

బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ లీసా హెడెన్. ఈమె హిందీలో పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈమె ఎక్కువగా బోల్డ్ పాత్రలు చేయడం వల్ల ప్రేక్షకులు ఆమె ఏం చేసినా కూడా ఆ యాంగిల్ లోనే చూస్తున్నారు. ఈమె సంవత్సరం క్రితం తన కన్న కొడుకు జాక్కు పాలు ఇస్తూ ఫొటో తీయించుకుంది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పిల్లలకు తల్లి పాలు ఎంత ముఖ్యమో చెబుతూ లీసా హెడెన్ కామెంట్ పెట్టింది. నలుగురిలో ఉన్నా కూడా చంటి బిడ్డకు పాలు ఇచ్చేందుకు తల్లిగా సంకోచించాల్సిన అవసరం లేదు అంటూ లీసా ఆ ఫొటో ద్వారా చెప్పాలని చూసింది.

లీసా ఒకటి అనుకుంటే జనాలు మరోటి అర్థం చేసుకున్నారు. తల్లి ప్రేమను బిడ్డకు పాల రూపంలో అందించాలని బిడ్డ ఆరోగ్యంగా జీవించేందుకు తల్లి పాలు ముఖ్యం అంటూ లీసా చెప్పాలనుకోగా జనాలు మాత్రం అందులో కూడా మరో యాంగిల్ ను వెదికి విమర్శలు చేయడం ప్రారంభించారు. సంవత్సర కాలంగా లీసాను విమర్శలతో జనాలు ముంచెత్తుతూనే ఉన్నారు. పశువులు మాత్రమే ఎక్కడ పడితే అక్కడ తమ పిల్లలకు పాలు ఇస్తాయి నువ్వు ఏమైనా పశువువా అందరి ముందు పాు ఇచ్చేందుకు అంటూ లీసాపై విమర్శలు వెళ్తు వెత్తాయి. ఇప్పటికి కూడా లీసా సోషల్ మీడియాలో పిల్లాడికి పాలు ఇస్తున్న ఫొటో పెట్టట్లేదు - పాలు ఇవ్వడం మానేశావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తనపై వస్తున్న కామెంట్స్కు స్పందించిన లీసా హెడన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో వారిపై జాలి కూడా కలుగుతుందని చెప్పుకొచ్చింది. నలుగురిలో ఉన్నప్పుడు ఆ చంటి పిల్లకు తన తల్లి నలుగురిలో ఉంది ఇప్పుడు ఆకలి అనవద్దు అంటూ తనకు తెలియదు. అందుకే పాల కోసం ఏడుస్తుంది. అప్పుడు ఆ తల్లి పాలు ఇచ్చేందుకు సంకోచించకూడదు అనే ఉద్దేశ్యంతోనే తాను ఆ ఫొటోను పెట్టాను కాని జనాలు మాత్రం అందులో కూడా ఇంకేదో చూసి విమర్శలు చేశారు అంటూ లీసా హెడెన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...