కొన్ని నెలలే బతుకుతా:బాలీవుడ్ స్టార్ ప్రకటన | Live for a few months: Bollywood star statement

Irfan-Khan-Said-I-Will-Die-In-A-Few-Days-Andhra-talkies

కొన్ని నెలలే బతుకుతా:బాలీవుడ్ స్టార్ ప్రకటన | Live for a few months: Bollywood star statement

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొన్ని రోజులుగా న్యూరో ఎండ్రోక్రిన్ ట్యూమర్ అనే మెదడుకు సోకే అత్యంత అరుదైన - ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ వ్యాధికి ఆయన లండన్ లోని ప్రఖ్యాత ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ చిక్కిపోయిన ఇర్ఫాన్ తాజాగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఓ షాకింగ్ ప్రకటన చేశాడు. ‘నేను బతికేది మరికొన్ని నెలలు మాత్రమే.. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతూనే ఉంటోంది’ అని ఇర్ఫాన్ ఖాన్ బాంబు పేల్చాడు.
‘నా జీవితం చివరి దశకు వచ్చింది. ఎన్నో రోజులు బతుకుతాను అనే బెంగ లేకుండా.. నాకున్న జీవితాన్ని సంతోషంగా అనుభవించేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ భావోద్వేగంతో ప్రకటించారు. కొన్ని నెలలు - లేదంటా రెండేళ్లు బతుకుతాను కావచ్చు.. ఇకపై తాను ఇటువంటి వ్యాఖ్యలు చేయను అంటూ వివరణ ఇచ్చాడు.

ప్రస్తుతం క్యాన్సర్ కు ఇర్పాన్ చికిత్స తీసుకుంటున్నాడు. నాలుగు కీమో థెరపీ సైకిల్స్ పూర్తయ్యాయి.. మరో రెండు మిగిలి ఉన్నాయని తెలిపాడు. మొత్తం పూర్తయ్యాక స్కాన్ తీస్తే ఆ తర్వాత విషయం తెలుస్తుందని ఇర్ఫాన్ తెలిపాడు. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...