గతం గతః అంటున్న అరవింద! | The past is going to last!

Pooja-Hegde-Ignores-Her-Debut-Movie-Andhra-Talkies

గతం గతః అంటున్న అరవింద! | The past is going to last!

పెద్ద హిట్లు లేకపోయినా టాప్ స్టార్ల సినిమాల్లో అవకాశం సాధించడం చాలా తక్కువ మంది బ్యూటీలకు మాత్రమే సాధ్యమవుతుంది.  బెంగళూరు బ్యూటీ పూజా అలాంటి లక్కీ హీరోయినే.  తెలుగులో ఒకరి అరా సినిమాల్లో నటించిన సమయంలోనే అశుతోష్ గోవారికర్ దర్శత్వంలో తెరకెక్కిన హృతిక్ రోషన్ సినిమా 'మొహెంజోదారో' సినిమాలో అవకాశం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.  కాకపొతే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అని కామెంట్స్ వినిపించాయి.  కానీ అల్లు అర్జున్ సినిమా 'డీజే' లో అవకాశం సాధించింది.  'డీజె' సినిమాలో తన గ్లామర్ షో తో అందరి దృష్టిని ఆకర్షించి వరసగా ఆఫర్లు అందుకుంది.

రీసెంట్ గా పూజా హెగ్డే హిందీ డెబ్యూ ఫిలిం 'మొహెంజోదారో'  సినిమా ఫెయిల్యూర్ గురించి ప్రస్తావించి ఆమె అభిప్రాయం అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది.. "అది గతంలో జరిగింది. అక్కడి నుండి నేను చాలా దూరంలో వచ్చాను".   అంటే ఆ సినిమాగురించి పూజా మాట్లాడదలుచుకోలేదన్న మాట.   గతంలో ఒక ఇంటర్వ్యూ లో కూడా పూజా తను జరిగిపోయినా విషయాల గురించి ఆలోచించనని చెప్పుకొచ్చింది. అంటే 'గతం గతః'... 'పాస్ట్ ఈజ్ పాస్ట్' లాంటి ప్రిన్సిపుల్స్ ను చక్కగా ఫాలో అవుతుందన్నమాట. ఒక సందేహం ఏంటంటే ఆమె ఫ్లాపుల విషయంలోనేనా.. లేక హిట్స్ వస్తే కూడా 'పాస్ట్ ఈజ్ పాస్ట్' మంత్రం పఠిస్తుందా..?

ఆ విషయం గురించి తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాలి.  మరోవైపు ఈ అమ్మడు తెలుగులో ఎన్టీఆర్ 'అరవింద సమేత' -  మహేష్ బాబు 'మహర్షి' లాంటి క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.  హిందీ లో 'హౌస్ ఫుల్- 4' లో హీరోయిన్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...