షోయబ్ ను సానియా పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అదేనట! | Sania is the leading cause of her marriage to Shoaib!

Shoaib-and-I-didnt-marry-to-unite-India-Pakistan--Sania-Mirza-Andhra-Talkies.jpg

షోయబ్ ను సానియా పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అదేనట! | Sania is the leading cause of her marriage to Shoaib!

అది ఆటైనా.. మరేదైనా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలో మరే క్రీడాకారినికి లేనంత స్టార్ డమ్.. సెలబ్రిటీ స్టేటస్ సానియా మీర్జా సొంతంగా చెప్పాలి. ఆమెకు సంబంధించిన వార్తలకు మీడియాలో లభించే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దేశంలో ఇంతమంది క్రీడాకారులు ఉన్నా.. టీమిండియాలోని కొందరు క్రికెటర్ల తర్వాత.. ఆ స్థాయిలో సెలబ్రిటీ స్టేటస్ సానియా సొంతం.

ఆ మధ్యన పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా.. తాజాగా గర్భవతి అన్న విషయం తెలిసిందే. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న ఆమె.. తాజాగా ఒక పత్రిక కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నారు.ఈ  సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఒక ఆసక్తికర అంశాన్ని ఆమె చెప్పారు. తన పెళ్లికి సంబంధించి పలువురు పడుతున్న అపొహపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను షోయబ్ ను పెళ్లి చేసుకున్నది భారత్.. పాక్ లను కలపటం కోసమేనన్న భావనను వ్యక్తం చేస్తుంటారని.. కానీ.. అదేమాత్రం నిజం కాదన్నారు. తన భర్త తరఫు బంధువుల్ని కలవటానికి తాను ఏడాదికి ఒకసారి పాక్ కు వెళ్తానని.. ఆ సందర్భంగా ఆ దేశ వాసులు తనను వదిగా అభిమానాన్ని ప్రదర్శిస్తారని.. ప్రేమను చూపిస్తారని చెప్పారు.

అదే సమయంలో షోయబ్ ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు కూడా అతడి పట్ల అదే స్థాయిలో ప్రేమను.. అభిమానాన్ని ప్రదర్శిస్తారని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. షోయబ్ ను సోనియా పెళ్లి చేసుకున్నది రెండు దేశాల్ని కలపటానికి అన్న పీలింగ్ మీకెప్పుడైనా కలిగిందా?

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...