అదంతా ఫేక్ అంటున్న అందాల రాక్షసి | That's all the fake!

అదంతా ఫేక్ అంటున్న అందాల రాక్షసి | That's all the fake!

'గీత గోవిందం' హిట్ అయింది.  దానికి కొన్ని నెలల ముందు 'తొలిప్రేమ' హిట్ అయింది. రెండిటికీ లింకేమీ లేదు.  కానీ రెండు హిట్లే.   'గీత గోవిందం' సినిమాను చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేసినట్టుగా పరశురామ్ - హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ చెప్పారు.   ఆ తర్వాత టాలీవుడ్ లో గట్టిగా వినిపించిన టాక్ ఏంటంటే 'తొలిప్రేమ'... 'గీత గోవిందం' సినిమాలను లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేసిందని.

ఈ విషయం లావణ్య వరకూ వెళ్ళడంతో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'ఫేక్ న్యూస్ అలెర్ట్' అంటూ ట్వీట్ చేసింది.  అంతేకాదు మరొక ట్వీట్ లో "కొన్ని రూమర్ల విషయంలో కామ్ గా ఉన్నానంటే దానర్థం నాగురించి ఏదిపడితే అది మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని కాదు" అంటూ  ఒక ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది.  దీనర్థం లావణ్య ఈ రెండిటినీ మిస్సవ్వలేదు.  మరి ఈ జనాలు అందాల రాక్షసికి కోపం వచ్చే రూమర్లు ఎందుకు పుట్టిస్తున్నారు?

లావణ్య రియాక్షన్ ఇలా ఉంటే లావణ్యను ఫాలో అయ్యే ఒక నెటిజన్ 'కూల్ బేబీ.. జస్ట్ ఫ్రీ పబ్లిసిటీ అనుకో!' అంటూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. ఆ నెటిజను.. సోషల్ మీడియా సిటిజను చెప్పేదాంట్లో కాస్త లాజిక్కు ఉంది కదా!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...