'బిగ్ బాస్' విన్నర్.. ముందే బయటికి

Bigg-Boss-Winner-Kaushal-Andhra-Talkies.jpg

'బిగ్ బాస్' విన్నర్.. ముందే బయటికి

అనుకున్నదే జరిగింది. ‘బిగ్ బాస్’ రెండో సీజన్ విజేతగా కౌశలే నిలిచాడు. సంచలనాలకు తావేమీ లేకుండా అతడికే ట్రోఫీని కట్టబెట్టారు. ఐతే ‘బిగ్ బాస్’ షోలో రాత్రి తొమ్మిది గంటలకు విజేతను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ముందే విజేత ఎవరో వెల్లడైపోయింది. విన్నర్ ట్రోఫీతో కౌశల్ ఉన్న ఫొటోలు.. వీడియోలు ముందే బయటికి వచ్చేశాయి. విన్నర్ ట్రోఫీ చేతబట్టి హౌస్ మేట్లందరితో కలిసి కౌశల్ సెల్ఫీ తీసుకున్న పొటో రాత్రి ఏడున్నర ప్రాంతంలోనే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది.

మరోవైపు ‘బిగ్ బాస్’ సెట్ నుంచి బయటికి వచ్చి పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్న అభిమానుల్ని కౌశల్ పలకరించడం.. కారు మీదెక్కి విజయనాదం చేయడం.. అభిమానులతో కరచాలనం చేయడం.. తర్వాత కారెక్కి వెళ్లిపోవడం.. ఇదంతా కూడా వీడియోలో రికార్డయింది. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయింది. ఫైనల్ రోజు ముందుగా సామ్రాట్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత దీప్తి వైదొలిగింది. చివరగా కౌశల్.. గీతా మాధురిల నుంచి క్రౌడ్ ఫేవరెట్ కౌశల్ నే విజేతగా ప్రకటించారు. గీత రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. తొలి సీజన్లో శివబాలాజీ విజేతగా నిలిచిన విషయం చివరి వరకు వెల్లడి కాలేదు. అప్పుడు బిగ్ బాస్ సెట్ పుణె దగ్గర ఉండటంతో లీకులేమీ రాలేదు. ఈసారి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేయడంతో ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరన్నది. కూడా ముందే తెలిసిపోతూ వచ్చింది. ఫైనల్ విషయంలో నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...