సినిమా పరిశ్రమలో ఇంకెందరు తనుశ్రీలు ఉన్నారో?

Casting-Couch-Existance-in-Film-Industry-Andhra-talkies.jpg

సినిమా పరిశ్రమలో ఇంకెందరు తనుశ్రీలు ఉన్నారో?

ఇప్పుడు బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. నటుడు నానా పాటేకర్ తో పాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మీద చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నానా తనతో చాలా అసభ్యంగా ప్రవర్థించాడు అనేదే తనుశ్రీ ప్రధాన ఆరోపణ. ఎప్పుడో 2008లో జరిగితే ఇప్పుడెందుకు బయట పెట్టడం అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికేసింది. అదే సంవత్సరమే సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు తనుశ్రీ ఫిర్యాదు చేసినట్టు ఆధారాలు ఉన్నాయట. నానా లాంటి పెద్ద పలుకుబడి ఉన్న నటుడి మీద చర్యలు తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి అప్పట్లో అది అంతకు మించి ముందుకు సాగలేదు.

హిందీ తెలుగు తమిళ్ లో కొన్ని సినిమాలు చేసాక తనుశ్రీ ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయింది. అందులోనే సన్యాసినిగా స్థిరపడిందనే అనుకున్నారు అందరు. కానీ అనూహ్యంగా తనుశ్రీ ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలన ఆరోపణలు చేయడంతో తనకు మద్దతు ఇచ్చేవారు వ్యతిరేకించేవారు ఇద్దరూ తయారయ్యారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు కానీ ఇప్పుడు చాలా విషయాలు చర్చలోకి వస్తున్నాయి.

నిజానికి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఇలాంటి వేధింపులు అన్ని బాషా పరిశ్రమలో ఉన్నాయి. కృష్ణవంశీ తన ఖడ్గం సినిమాలో ఈ నిజాన్ని చూపడానికే ప్రత్యేకంగా హీరోయిన్ సంగీత పాత్రను డిజైన్ చేసాడు. ఒక్క ఛాన్స్ అంటూ దర్శకుల పడక దాకా వెళ్లేందుకు సిద్ధపడే ఆ పాత్ర ఎన్నో చేదు నిజాలను చెప్పింది. ఈ మధ్య సౌత్ లో మాధవి లతా-కస్తూరి-రాధికా ఆప్టే లాంటి వాళ్ళు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పేర్లు దాచిపెట్టి ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు తప్పించి అంతకన్నా ముందుకు వెళ్లలేకపోయారు. శ్రీరెడ్డి హంగామా బాగానే నడిచింది అసలు ప్రయోజనాన్ని పక్కదారి పట్టించడంతో జనాలు పట్టించుకోవడం మానేశారు.

హాలీవుడ్ లో నిర్మాత హార్వే విన్ స్టెయిన్ కు వ్యతిరేకంగా మీ టూ అనే ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఏకంగా 70 మంది నటీమణులు బయటికి వచ్చారు. సమాజం మొత్తం అతన్ని ఛీ కొట్టేలా చేసారు. కానీ మనదగ్గర ఆ పరిస్థితి లేదు. తెరవెనుక ఎందరో ఇంకా నలుగుతూనే ఉన్నారు. అవకాశాలు పోతాయనో లేక సంబంధాలు చెడగొట్టుకోవడం ఎందుకనో ఇలా వేర్వేరు కారణాలతో నిజాలు దాచి పెట్టేస్తున్నారు. దీనికి చరమగీతం పాడాలి అంటే నిజాలు బయటికి రావాలి. చట్టాన్ని ఉపయోగించి తప్పులు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. లేదా వీటికి అడ్డుకట్ట పడటం అసాధ్యం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...