ఘంటసాల బయోపిక్..గొడవ మొదలైంది

Controversy-on-Old-Singer-Ghantasala-Biopic-Andhra-talkies.jpg

ఘంటసాల బయోపిక్..గొడవ మొదలైంది

ఈ రోజుల్లో ఒక సినిమా విషయంలో వివాదం మొదలైతే పబ్లిసిటీ పరంగా అది మంచికే అనుకుంటున్నారు. అందులోనూ అంతగా బజ్ లేని సినిమాలకు ఇలాంటివి చాలా అవసరమని భావిస్తున్నారు. ఇటీవలే ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిన్న సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలేమాత్రం బజ్ లేని ఆ సినిమా గురించి ఈ వివాదం వల్లే జనాలకు తెలిసింది. కానీ ఆ గొడవ సినిమాకు ఏమాత్రం ప్లస్ అయిందన్నది సందేహమే.

ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ఓ చిన్న సినిమా విషయంలో గొడవ మొదలైంది. ఇటీవలే దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఘంటసాల పాత్రలో ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నటిస్తున్నాడు. ఆయన సతీమణి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటిస్తోంది. ఐతే ఈ సినిమా విషయంలో ఘంటసాల కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తన తండ్రి జీవితం ఆధారంగా సినిమా తీస్తూ ఆ విషయమే తమకు చెప్పలేదని.. ఘంటసాల కుమారుడు - సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రత్నకుమార్ మండిపడ్డారు. సినిమా తీసేముందు తమను సంప్రదించనే లేదని.. అనుమతి కూడా తీసుకోలేదని ఆయన ఆరోపించాడు. ఈ సినిమాను కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. మరి ఈ విషయమై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా ఘంటసాల ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన తెలుగు.. కన్నడ.. తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడారు. సంగీత దర్శకుడిగానూ సేవలందించారు.1974 ఫిబ్రవరి 11న 52 ఏళ్ల వయసుకే ఘంటసాల కన్నుమూశారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...