అక్కినేని కోడలు నేచురల్ క్వీన్

chitu-wife-heroin-Samantha-In-Glamourous-Outfit-Andhra-Talkies.jpg

అక్కినేని కోడలు నేచురల్ క్వీన్

పెళ్లయితే ఏంటట? ఇటీవలి కాలంలో పలువురు కథానాయికల నుంచి ఎదురవుతున్న ఎదురు ప్రశ్న ఇది. నిజమే పెళ్లయితే ఏంటట? స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు పాతరేయాలా?  వాటిని హరించేది పెళ్లి ఎలా అవుతుంది? అన్నది వారి ఉద్ధేశం కావొచ్చు. ఈ విషయంలో ఒక్కో కథానాయికను ఒక్కోలా డిఫైన్ చేయొచ్చు.

ఇక అక్కినేని కోడలు సమంత వైఖరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. వివాహానంతరం సామ్ స్వేచ్ఛ స్వాతంత్య్రం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది. మామ గారు కింగ్ నాగార్జున - హబ్బీ యువసామ్రాట్ నాగచైతన్య సమంత కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో సాయపడుతున్నారు. బోలెడంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. భర్త సపోర్టు లేనిదే ఏదీ కుదరదని ఇటీవలే సామ్ ఓ బహిరంగ వేదికపైనే అన్నారు. ఆ సపోర్ట్ తోనే రంగుల ప్రపంచంలో తనకు కావాల్సిన విధంగా తనని ఆవిష్కరించుకుంటున్నారు సమంత.అయితే ఇది గ్లామర్ వరల్డ్ కాబట్టి.. అక్కడ రిక్వయిర్మెంట్ కి తగ్గట్టే బిహేవియర్ ఉండాలి. అందాల ఎలివేషన్ చేయనిదే కుదరదిక్కడ. అది ఎలాంటి హోదా ఉన్న కథానాయికకు అయినా తప్పనిసరి. ఇదిగో ఈ ఫోటో చూస్తే ఆ సంగతి ఇట్టే అర్థమవుతోంది. రీసెంట్ గానే హబ్బీ నాగచైతన్యను ముద్దాడేస్తూ బోల్డ్ గా ఉన్న ఫోటోని సామ్ సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేశారు. లేటెస్టుగా ఓ స్పెషల్ ఫోటోని ఇలా ఇన్ స్టాలో షేర్ చేశారు. సమంత ఈ లుక్ లో అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్నారు. యువహృదయాల్ని దోచేస్తోంది ఈ స్టిల్. ఈ ఫోజులో సామ్ గట్స్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. అక్కినేని కోడలు ఎంతో నేచురల్ బ్యూటీ అంటూ పొగిడేస్తున్నారు. చైతన్యతో ``ఇబిజ`` అనే ఎగ్జోటిక్ లొకేషన్ లో వెకేషన్ లో ఉన్నప్పటి ఫోటో ఇది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...