మహేష్ - కొరటాల ఏంటిలా? | Mahesh - Koratala What is this?

Mahesh-Koratala-What-is-this?

మహేష్ - కొరటాల ఏంటిలా? | Mahesh - Koratala What is this?

మహేష్ - కొరటాల కాంబినేషన్ అనగానే `శ్రీమంతుడు` గుర్తుకొస్తుంది. ఆ వెంటనే `భరత్ అనే నేను` మైండ్ లోకొస్తుంది.  మహేష్ చేత ఊళ్లను దత్తత తీస్కునేలా చేశాడు. ఆ తర్వాత సీఎంగానూ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనుడు కొరటాల శివ. రచయితగా - దర్శకుడిగా - దార్శనికుడిగా అన్ని కోణాల్లోనూ మెప్పు పొందాడు. ప్రస్తుత సమాజానికి ఎలాంటి సినిమా చూపిస్తే మంచిది? అన్నది కూడా కొరటాలకు బాగా తెలుసు. అన్ని కమర్షియల్ హంగులతో పాటు చక్కని సందేశం ఇవ్వాలి. సంఘంలో మార్పు కోరాలి. అలా చేస్తేనే ప్రేక్షకులు మెచ్చుకుంటారని పదే పదే ప్రూవ్ చేస్తున్నాడు. రాజమౌళి తర్వాత అపజయం అన్నదే లేని ఏకైక దర్శకుడిగా కొరటాల పేరు మార్మోగిపోతోంది.

అందుకే ఆ ఇద్దరూ ఓచోట కనిపించారు అనగానే బోలెడన్ని సందేహాలు. అసలింతకీ మహేష్ తో కొరటాల ఏం సంభాషిస్తున్నారు ఈ సీన్లో? అంటే ఇదంతా `అభి బస్` వాణిజ్య ప్రకటన కోసం చేసిన సెటప్. మహేష్ - వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఈ ప్రకటనను రూపొందించారు కొరటాల. రీసెంటుగానే షూటింగ్ పూర్తి చేశారు.  త్వరలోనే ఇది ఎయిర్ లోకి రానుంది. ఆ క్రమంలోనే మహేష్ ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి.

ఈ ఫోటోల్లో మహేష్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారంటూ అభిమానుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. వాస్తవానికి ఆ గెడ్డం గెటప్ మహర్షి చిత్రంలోనిది. ఆ గెటప్ తోనే అభిబస్ యాడ్ షూట్ కూడా కానిచ్చేశారు. అక్కడ కాలేజ్ కుర్రాడిగా నటిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అదే ఈ ప్రకటనకు అదనపు ఆకర్షణ కాబోతోంది. చిన్న పాటి గ్యాప్ తో వాణిజ్య ప్రకటనల్లో నటించేస్తున్న మహేష్ మరోవైపు సినిమాల షూటింగులు ఆపకుండా బ్యాలెన్స్ చేయడం ఆసక్తికరమే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...