సెట్లో మందు కొట్టిన నాగ్?

Naturural-Hero-Nani-On-About-Tollywood-Hero-Nagarjuna-in-Devadas-Movie-Andhra-Talkies.jpg

సెట్లో మందు కొట్టిన నాగ్? 

దేవదాస్’ టీంను మంచు లక్ష్మీప్రసన్న ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో ఆమె సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా నాగార్జున లక్ష్మి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ‘‘సినిమాలో మీరెప్పుడూ చేతిలో మందు గ్లాసులో ఉంటారని విన్నాను. షూటింగ్ టైంలో నిజంగానే మందు కొట్టారా’’ అని లక్ష్మి ప్రశ్నించగా..  ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ ‘‘అవును మందు సిప్ చేసే వాడిని. సాయంత్రం షూటింగ్ ఉన్నపుడు కొంచెం కొంచెం మందు సిప్ చేసేవాడిని’’ అని నాగార్జున సమాధానం ఇచ్చాడు. దీనికి మంచు లక్ష్మి ఆశ్చర్య పోగా.. ‘‘నాకు చెప్పుంటే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని కదా’’ అంటూ నాని కామెంట్ చేయడం గమనార్హం.


రష్మిక.. ఆకాంక్ష వీళ్లిద్దరిలో డేట్ కు ఎవరిని తీసుకెళతారు అని మంచు లక్ష్మి నాగార్జునను ప్రశ్నించగా... ఆకాంక్ష అని సమాధానం ఇచ్చాడు నాగ్. ఆమె పాటలు బాగా పాడుతుందని.. డేట్ కు తీసుకెళ్లి పాటపాడించుకుంటాను అని నాగ్ చెప్పాడు. మంచు లక్ష్మి కోరిక మేరకు ఆకాంక్ష ‘క్రిమినల్’ హిందీ వెర్షన్ పాట పాడింది.మరోవైపు నాగార్జునతో షూటింగ్ అనుభవం గురించి నానిని ప్రశ్నిస్తే ఆసక్తికర విషయం చెప్పాడు. ‘‘దేవదాస్ షూటింగ్ మొదలైన రెండో రోజు నాగ్ సర్ జాయినయ్యారు. ఆయనపై తీసిన తొలి షాట్లో నడుచుకుంటూ రావాలి. ఆయన నడిచి రాగానే యూనిట్లో ఉన్న మొత్తం అందరూ విజిల్స్.. క్లాప్స్ తో ఎంకరేజ్ చేశారు. నేను షాకయ్యాను. నిన్నటి నుంచి నేను బట్టలు చించుకుని డాన్స్ వేస్తుంటే ఒక్క కాంప్లిమెంట్ కూడా లేదు. అపుడు నాకో ఒక క్లారిటీ వచ్చింది. ఆయనకు ఉన్న క్రేజ్ అది. దాన్ని మనం డిమాండ్ చేయకూడదు వస్తే తీసుకోవాలి అని’’ అని నాని చెప్పాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...