నందమూరి హరికృష్ణ గారి చివరి కోరిక తీరుద్దాం: హీరో మంచు మనోజ్ | Nandamuri Harikrishna's last wish will be: Hero Manchu Manoj

nandamuri-harikrishnas-last-wish-will-be-Hero-Manchu-Manoj

నందమూరి హరికృష్ణ గారి చివరి కోరిక తీరుద్దాం: హీరో మంచు మనోజ్ | Nandamuri Harikrishna's last wish will be: Hero Manchu Manoj

నందమూరి హరికృష్ణ గారి చివరి కోరిక తీరుద్దాం అంటూ మంచు మనోజ్ పిలుపునివ్వడంతో పలువురు ఫ్యాన్స్ తమవంతు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు వస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేరళ వరద విషాదం నేపథ్యంలో తన అరవై రెండవ పుట్టినరోజు జరుపుకోవడం లేదని, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా తన పుట్టినరోజు వేడుక జరుపవద్దని సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా పెట్టే ఖర్చును కేరళ వరద బాధితుల కోసం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

చివరికోరిక తీరుద్దాం: మంజు మనోజ్ ఈ విషయమై మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ.... ‘హరికృష్ణగారి చివరి కోరిక తీరుద్దాం. ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపకుండా అందుకు పెట్టే ఖర్చును కేరళ వరద బాధితులకు విరాళంగా ఇద్దామని సూచించారు

తన వంతుగా రూ. 5 లక్షల సహాయం హరికృష్ణగారి చివరి కోరిక మేరకు తనవంతుగా రూ. 5 లక్షల సహాయం కేరళకు అందించబోతున్నట్లు మంచు మనోజ్ ప్రకటించారు. నందమూరి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు కూడా కేరళ బాధితులకు సహాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

దేవుడు కఠినాత్ముడు తారక్, కళ్యాణ్ రామ్ అన్న, వారి కుటుంబాన్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. దేవుడు నిజంగా కఠినాత్ముడు. వారికి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా చివరి వరకు నేను మీతో ఉంటాను. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలి... అని మనోజ్ ట్వీట్ చేశారు.

ఆ బాధ తట్టుకోలేక హరికృష్ణ మరణించిన రోజు టీవీలో యాక్సిడెంట్ దృశ్యాలు ప్రసారం చేస్తుండటంతో... అవి చూసి తట్టుకోలేక మీడియాను మనోజ్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విజువల్స్ పదే పదే చూపించి మమ్మల్ని మరింత బాధపెట్టవద్దని మనోజ్ కోరారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...