అవకాశాలు లేక బిక్షమెత్తుతున్న టాప్ డైరెక్టర్!

Opportunities-or-Bailing-Top-Director

అవకాశాలు లేక బిక్షమెత్తుతున్న టాప్ డైరెక్టర్!

బండ్లు ఓడలు - ఓడలు బండ్లు అవ్వడం అనేది సినిమా పరిశ్రమలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నిర్మాతల విషయంలో ఇది జరుగుతుంది. ఒక్క సినిమా హిట్ అయితే నిర్మాత స్థాయి అమాంతం పెరుగుతుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తాజాగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సెంథిల్ నాథన్ సినిమాల్లో ఆఫర్ లేక పోవడంతో కలత చెంది కంచి దేవాలయం వద్ద బిక్షాటనం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... అప్పట్లో ఎంజీఆర్ వంటి స్టార్ తో సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు జంబులింగం తనయుడు సెంథిల్ నాథన్. తండ్రి బాటలో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన సెంథిల్ నాథన్ మొదట సహాయ దర్శకుడిగా పలు చిత్రాలకు వర్క్ చేశాడు. ఆ తర్వాత 20 చిత్రాలకు దర్శకుడిగా కూడా చేశాడు. అందులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక 2009వ సంవత్సరంలో ఉన్నై నాన్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆ సినిమా విడుదల కాలేదు. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చాడు.


సీరియల్స్ కు వర్క్ చేసిన సెంథిల్ నాథన్ అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయాడు. తాజాగా ఒక సీరియల్ నుండి తప్పించబడ్డాడు. నటిస్తూ - దర్శకత్వం చేస్తున్న సీరియల్ నుండి తప్పించడంతో మనస్థాపంకు గురైన సెంథిల్ నాథన్ ఎవరికి చెప్పకుండా కంచికి వెళ్లి పోయి అక్కడ బిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. తాజాగా సెంథిల్ అక్కడున్నట్లుగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరియు సినిమా పరిశ్రమ వారు చెన్నైకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. బలవంతంగా తీసుకు వస్తే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ హెచ్చరించాడు. దాంతో వెనుదిరిగిన కుటుంబ సభ్యులు తాజాగా పోలీసుల సాయంతో ఆయన్ను చెన్నైకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం డాక్టర్లు సెంథిల్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...