మళ్లీ టాలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న రజినీ | Rajini is tensioning again with Tollywood

Rajinikanth-Peta-Movie-Released-During-Sankranti-Andhra-Talkies

మళ్లీ టాలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న రజినీ | Rajini is tensioning again with Tollywood

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదల విషయంలో అప్పుడు గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే. తెలుగులో పెద్ద హీరోల సినిమాల విడుదల తేదీ ఫిక్స్ అయిన తేదీలో ‘కాలా’ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు నిర్మాతలు ‘కాలా’ విడుదల విషయంలో ధనుష్ తో కూడా చర్చలు జరపడం జరిగింది. ముందు నుండి ప్లాన్ చేసుకున్న తెలుగు సినిమాల విడుదల తేదీల్లో గందరగోళం ఏర్పడినది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి క్రియేట్ అవుతుంది.

ప్రస్తుతం రజినీకాంత్ ‘పేట’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. తమిళ ఆడియన్స్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్లో చిత్రీకరణ పూర్తి చేసి జనవరిలో రెండవ వారంలో సినిమాను విడుదల చేసేందుకు చకచక వర్క్ జరుగుతుందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవలే చెప్పినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రామ్ చరణ్ - బోయపాటిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తూ - నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’ మరియు వెంకీ - వరుణ్ ల మల్టీస్టారర్ మూవీ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడు చిత్రాలతో పాటు ఒకటి రెండు చిన్న చితకా చిత్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ‘పేట’ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి సినిమాల నిర్మాతల్లో టెన్షన్ ప్రారంభం అయ్యింది. అనుకున్న సమయంకు ఈమద్య రజినీకాంత్ మూవీ ఏది కూడా రాలేదు. మరి ఈ చిత్రం కూడా వాయిదా పడనుందా? లేదంటే జనవరిలోనే విడుదల అవ్వనుందా అనేది చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...