10 కోట్ల వ్యూస్ తో రంగమ్మా మంగమ్మా రచ్చ...రచ్చ! | Rangamma Mangamma Racha with 10 Crore Views

100-Million-views-for-Rangamma-Mangamma-song-Andhra-Talkies

10 కోట్ల వ్యూస్ తో రంగమ్మా మంగమ్మా రచ్చ...రచ్చ! | Rangamma Mangamma Racha with 10 Crore Views

దేవీ శ్రీప్రసాద్ ట్యూన్ చేస్తే చాలు ఆ పాట చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక దేవీ సంగీతం అందించిన సినిమాకు సుకుమార్ పిక్చరైజేషన్.. చరణ్ - సమంతాలాంటి లీడ్ యాక్టర్స్ తోడైతే ఆ పాట దుమ్ముదులపకుండా ఉంటుందా? 'రంగస్థలం' పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  ఇక అందులో 'రంగమ్మా మంగమ్మా' సాంగ్ తాజాగా 100 మిలియన్(10 కోట్లు) వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.

లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటింది.. 2.8 లక్షల లైక్స్ వచ్చాయి.  అతి తక్కువ సమయంలో ఇలా 100 మిలియన్ వ్యూస్ సాధించడం మరో విశేషం.  దేవీ ట్యూన్ తో పాటుగా.. చంద్రబోస్ క్యాచీ లిరిక్స్.. MM మానసి గానం..  చరణ్ ను ఆటపట్టిస్తూ సమంతా చేసిన అల్లరి ఈ పాటకు ఈ రికార్డును సాధించి పెట్టాయనడం లో సందేహం లేదు.


రంగమ్మా మంగమ్మా కాకుండా ఇప్పటి వరకూ సింగిల్ యూట్యూబ్ ఛానెల్ 100 మిలియన్ మార్క్ టచ్ చేసిన తెలుగు పాటలు రెండే.  అందులో సాహోరే బాహుబలి ఒకటి కాగా.. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే(ఫిదా) రెండోది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...