నా ఆర్మీ గురించి పూజా చెప్పగానే ఏడ్చేశాను : కౌశల్

Bigg-Boss-Winner-Kaushal-on-about-Kaushal-Army-Andhra-Talkies

నా ఆర్మీ గురించి పూజా చెప్పగానే ఏడ్చేశాను : కౌశల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కు ఈ విజయం అంత సునాయాసంగా రాలేదు అని షో చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. మొదటి వారం నుండి అతడు పడ్డ కష్టంకు సరైన ప్రతిఫలం దక్కింది అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ పేరును ప్రకటించిన వెంటనే భావోద్వేగంకు గురయ్యాడు. విజేతగా నిలిచిన కౌశల్ కు ఆయన ఆర్మీ అన్నపూర్ణ స్టూడియో నుండి పెద్ద ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం కౌశల్ మాట్లాడుతూ తనతో పోటీ పడ్డ ఇంటి సభ్యుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిలో ఒక్క శ్యామల తప్ప మిగిలిన అంతా కూడా నన్ను టార్గెట్ చేశారు. ఇంట్లోంచి పంపించేందుకు శ్యామల తప్ప అందరు ప్రయత్నించారు అంటూ కౌశల్ అన్నాడు. నన్ను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని శపథం చేశారు. అయితే నేను సింపుల్ గా నామినేట్ చేశాను. మీరు మాత్రం ఆయన్ను ఎలిమినేట్ చేసేందుకు ఎక్కువగానే కష్టపడ్డారు. తాను ఎప్పుడు కూడా తనీష్ తనకు పోటీగా భావించలేదు అన్నాడు. తనీష్ ఎక్కువగా దీప్తి సునయనకు పాంపరింగ్ చేయడంలోనే సరిపోయింది. అందుకే అతడు నాకు పోటీ అనుకోలేదు.

నాకు కౌశల్ ఆర్మీ గురించి మొదట చెప్పిన వ్యక్తి పూజా రామచంద్రన్. ఆమె నాకు మీ గురించి చెప్పిన విషయం నాకు కన్నీరు తెప్పించింది. వాట్ ఏ ఆర్మీ - వారు చేస్తున్న పనులు అద్బుతం అంటూ మీ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. కన్నీళ్లు ఆగలేదు. అప్పటి నుండి కూడా నాలో మరింత కసి పెరిగిందన్నారు. ఇక మీ గురించి తెలిసిన తర్వాత గీతా మాధురి ఎక్కువగా నన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. ఆమె నన్ను ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేది. ఆమె పాడితే గీతా మాధురి మిగతా సమయంలో మాత్రం గీతా భాదురి అంటూ ఆమెపై ఫన్నీ కామెంట్స్ను కౌశల్ చేశాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...