అవతార్ 2 - అవతార్ 3 కథలు లీక్

Hollywood-latest-movies-Avatar-2-and-Avatar-3-Movie-Script-Leaked-Andhra-talkies

అవతార్ 2 - అవతార్ 3 కథలు లీక్

2009లో రిలీజైంది అవతార్. 2.7 బిలియన్ డాలర్ల గ్రాస్ తో ఇప్పటికీ ఈ సినిమా నంబర్ 1 స్థానంలో నిలిచింది. అవతార్ రిలజై ఇప్పటికే 9 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సిరీస్లో సీక్వెల్ సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. 18 డిసెంబర్ 2020లో అవతార్ 2 - 17 డిసెంబర్ 2021న అవతార్ 3 చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయని ఇదివరకూ దర్శకదిగ్గజం - ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. అవతార్ సినిమాలో ఒక పండోరా చూపించినందుకే అంత ఎగ్జయిట్ అయ్యారు. ముందుంది ముసళ్ల పండగ! అని అప్పట్లోనే ప్రకటించాడు. అందుకు తగ్గట్టే భారీ కాన్వాసుపై పార్ట్ 2 -3 చిత్రాల్ని పూర్తి చేస్తున్నారు.

ఇప్పటికి అవతార్ 2 - అవతార్ 3 సినిమాల చిత్రీకరణ పూర్తయింది. ఇకపై నిర్మాణానంతర పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే ఇంకో రెండేళ్ల పాటు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే కేటాయించనున్నారు. ముందుగా షూటింగ్ పూర్తవ్వగానే అవతార్ లోగోని కామెరూన్ బృందం ఆవిష్కరించింది. ఈ లోగోని `పాపిరస్` తరహాలో డిజైన్ చేయడం ఆసక్తి పెంచుతోంది. ఈ డిజైన్ లో జేక్ సుల్లీ రెట్టింపు బలం పెంచుకుని తన డేగ (పాపిరస్)పై ప్రయాణిస్తూ కనిపించాడు.ఆసక్తికరంగా ఈసారి పార్ట్ 2 - పార్ట్ 3లో మునుపెన్నడూ చూడని గొప్ప పండోరాని చూడబోతున్నారని చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు.. ఈ సీక్వెల్ సినిమాల కథలో ట్విస్టు ఒకటి రివీలైంది. పార్ట్ 1లో జేక్ సులీ - పండోరా గిరిజన యువతి నియేత్రి లవ్ స్టోరిని చూపించారు. అవతార్ 2లో ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారట. వీటితో పాటు భారీ యాక్షన్ ని స్పెషల్ గా రూపొందించారట. అలానే సీక్వెల్స్ లో అండర్ వాటర్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని చెబుతున్నారు. కొన్ని నిమిషాల పాటు అండర్ వాటర్ సీన్స్ మతి చెడగొడతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండర్ వాటర్ సీన్స్ అనగానే - ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించిన `జురాసిక్ వరల్డ్ 2` చిత్రంలో కొన్ని సీన్స్ గుర్తుకు రావాల్సిందే. ఆ చిత్రంలోనూ డీప్ సీలో ఓ సన్నివేశాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఇప్పుడు కామెరూన్ అదే తరహాలో `అవతార్ 2` - `అవతార్ 3` చిత్రాల్లో అండర్ వాటర్ ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడా? అన్న చర్చా మొదలైంది. ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...