విషాదం నుంచి వెలుగు పంచిన తారక్!

Hero-Junior-NTR-Speech-At-Aravinda-Sametha-Success-Meet-Andhra-Talkies.jpg

విషాదం నుంచి వెలుగు పంచిన తారక్!

అరవింద సమేత- వీర రాఘవ` షూటింగ్ ముగింపులో ఉండగా తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణానికి గురైన సంగతి తెలసిందే. ఆ ఘటన ఇప్పటికీ నందమూరి కుటుంబాన్ని విడిచిపెట్టడం లేదని అర్థమవుతోంది. అరవింద వేదికలపై తారక్ - కళ్యాణ్ రామ్ కన్నీళ్లతో .. దుఃఖంతో కనిపించి అభిమానుల గుండెల్ని ద్రవింపజేశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ ఎంతో ఎమోషన్ అయ్యాడు. నేడు శిల్పకళా వేదిక పైనా తారక్ అంతే ఎమోషనల్ గా కనిపించాడు. తమ కుటుంబంలో విషాదం ఎదురైన వేళ ఇలాంటి విజయాన్ని ఇచ్చి త్రివిక్రమ్ వెలుగును పంచాడని అన్నాడు. ఈరోజు ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటాను. అన్నయ్య నాన్న ఉండి ఉంటే బావుండేది అన్నారు. కానీ నాన్న ఎక్కడో లేరు. ఇక్కడే ఉండి చూస్తూ ఉంటారు. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో ఇక్కడికొచ్చిన బాబాయ్ కి పాదాభివందనాలు.. అనీ అన్నాడు.


తారక్ మాట్లాడుతూ -``అరవింద సమేత వీర రాఘవ.. ప్రయత్నానికి మీ ఆశీర్వాదాన్ని అందించినందుకు ప్రేమాప్యాయతల్ని కురిపించి విజయం అందించిన అభిమాన సోదరులందరికీ వందనాలు. ఎంతో శ్రద్దతో - నమ్మకంతో - జాగ్రత్తతో ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికిననా ఆప్త మిత్రుడు - శ్రేయోభిలాషి - కుటుంబ సభ్యుడు అయిన త్రివిక్రమ్ కి ధన్యవాదాలు. ఈ విజయదశమికి విషాదంలో ఉన్న మా కుటుంబంలోకి ఒక కొత్త వెలుగును ఇచ్చాడు త్రివిక్రమ్. జీవితాంతం గుర్తుంచుకునే సినిమా ఇచ్చారు. పనిచేసిన ప్రతి నటీనటుడు - సాంకేతిక నిపుణులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు`` అన్నారు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. అంటూ తారక్ తన స్పీచ్ ని ముగించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...