వ్యవస్థలో పురుగులపై శంకర్ కు ఎంత కోపమో!

Director-Shankar-on-ABout-Robo-2-0-Movie-Andhra-Talkies
Director-Shankar-on-ABout-Robo-2-0-Movie-Andhra-Talkies
సూపర్ స్టార్ రజనికాంత్ శంకర్ ల విజువల్ వండర్ 2.0 ధియేటర్లలో రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఏ రేంజ్ హిట్ ఎలాంటి వసూళ్లు వస్తాయి అనేది తేలడానికి టైం పడుతుంది కాని కించిత్ కూడా పోటీ లేని లాంగ్ వీకెండ్ ని తలైవా ఫుల్ గా వాడుకోబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వం గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉన్నా థీమ్ ని ప్రెజెంట్ చేయడంలో మునుపటి స్థాయిని చూపలేకపోయాడన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

ఇకపోతే శంకర్ లో సామాజిక స్పృహ ఎంత ఉందో మరోసారి 2.0 లో బయట పడింది. అదెలా అంటారా. మీరే చూడండి. మొదటి సినిమా జెంటిల్ మెన్ మొదలుకుని ఇవాల్టి 2.0 దాకా తన సినిమాల్లో హీరోలు వ్యవస్థకు చీడపురుగుల్లా మారి డబ్బు కోసం దిగజారిన వాళ్ళను హత్య చేయడం కామన్ గా కనిపిస్తుంది. జెంటిల్ మెన్ లో ముఖ్య మంత్రి-ప్రేమికుడులో గవర్నర్- భారతీయుడులో ప్రభుత్వాధికారులు- ఒకే ఒక్కడులో మాజీ సిఏం-ఐలో పెద్ద మల్టీ మిలియనీర్ ఇలా అందరు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు ఎంత తప్పు చేసినా వదలకూడదు అనేది శంకర్ సిద్దాంతంగా చూపిస్తాడు.

అన్నంత పనీ చేసిన తమిళ్ రాకర్స్

Robo-2-0-Movie-Leaked-On-day-1-Andhra-Talkies
Robo-2-0-Movie-Leaked-On-day-1-Andhra-Talkies
దాదాపు 600 కోట్ల బడ్జెట్ వెచ్చించి - నాలుగేళ్ల పాటు.. వందలాది మంది టెక్నీషియన్లు రేయింబవళ్లు శ్రమిస్తే .. రూపొందిన సినిమా 2.0. ఇలాంటి సినిమాని పైరసీకారులు లీక్ చేసినా చూడకండి. థియేటర్లకు వచ్చి సినిమాని బతికించండి అని ప్రాధేయ పడింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ సందేశం వైరల్ అవుతోంది. ఉదయం ఆట పడింది మొదలు.. తమిళనాడు వ్యాప్తంగా రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక అద్భుతాన్ని చూశామన్న ఆనందంతో డప్పులు వాయిస్తూ మతాబులు - తారా జువ్వలు వెలిగించి సంబరాలు చేసుకుంటున్నారు. అన్నిటికీ మించి భారత దేశంలో సైతం ఇక మీదట అవెంజర్స్ - బ్లాక్ పాంథర్ - బ్యాట్ మేన్ - స్పైడర్ మేన్ లాంటి గొప్ప సినిమాల్ని తీయగలిగే సత్తా ఉందని శంకర్ నిరూపించారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. 2.0కి సమీక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా 3డి విజువల్స్ - టెక్నికాలిటీస్ పరంగా ఎంతో గొప్ప స్టాండార్డ్స్ని ఆవిష్కరించిందన్న ప్రశంసలు దక్కాయి.

డిసెంబర్ 21 - అంతా కొత్త సినిమాల మోత! | December 21 - All the new movies!

21-december-21-all-new-movies-andhra-talkies
December 21 - All the new movies!
ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం చాలా సాధారణం అయిపోయింది. వసూళ్ల పరంగా ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపిస్తుందని తెలిసినా కూడా నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండటం లేదు. ఇప్పుడు వదిలేస్తే మరో వారానికి పోటీ పెరగడమో లేదా హాలిడే సీజన్ ని మిస్ కావడమో జరుగుతుంది. అందుకే సై అంటే సై అంటూ బరిలో దూకుతున్న వాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ 21 అన్ని క్రేజే సినిమాలతో చాలా హాట్ గా మారేలా ఉంది.

శర్వానంద్-సాయి పల్లవి కాంబోలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు మీద ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన మొదటి టాలీవుడ్ స్పేస్ థ్రిల్లర్ అంతరిక్షం కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదే హోరా హోరి అనుకుంటే కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన శాండల్ వుడ్ మోస్ట్ కాస్ట్లీ మూవీ కేజీఎఫ్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. యష్ కి ఇక్కడ ఇమేజ్ లేకపోయినా కోలార్ బంగారు గనుల నేర సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ ఇక్కడి ప్రేక్షకులకు సైతం ఆకట్టుకుంటోంది. టాక్ పాజిటివ్ గా ఉంటే పోటీ  టఫ్ గానే ఉంటుంది.

శ్రీదేవి సీక్రెట్స్ బయట పెట్టనున్న "అతిలోక సుందరి శ్రీదేవి కథ" పుస్తకం | Sridevi Secrets is a book of the "Athiloka Sundari Sridevi" book

Athiloka-Sundari-Sridevi-Book-on-Secrets-in-Sridevi-Life-Andhra-Talkies
Sridevi Secrets is a book of the "Athiloka Sundari Sridevi" book
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం గురించి తెలిసిందే. దుబాయ్ లో చుట్టాల పెళ్లికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ ఘటనను శ్రీదేవి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. కాలంతో పాటే మరపు. శ్రీదేవి తర్వాత వారసురాలు జాన్వీలోనే తనని చూసుకుంటున్నారు ఫ్యాన్స్. జాన్వీ ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసి కథానాయికగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ సన్నివేశంలో శ్రీదేవి సీక్రెట్స్ ని రివీల్ చేస్తూ ఓ పుస్తకం లాంచింగ్ కి రెడీ అవుతుండడం ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చకొచ్చింది.

అతిలోక సుందరి శ్రీదేవి కథ` పేరుతో ఈ పుస్తకాన్ని సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించారు. మద్రాసు పరిశ్రమ నుంచి హైదరాబాద్ లో టాలీవుడ్ వేళ్లూనుకునే క్రమంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు వంటి స్టార్ల సరసన శ్రీదేవి నటించారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ లో గొప్ప అభినయనేత్రిగా నిరూపించుకున్నారు. ఆ సమయంలోనే శ్రీదేవిని పలుమార్లు పసుపులేటికి ఇంటర్వ్యూలు చేశారు. శ్రీదేవి కెరీర్ ఆద్యంతం అత్యంత సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టు ఆయన. శ్రీదేవికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఆయనకు తెలుసు. వాటన్నిటినీ గుదిగుచ్చి ఇప్పుడు పుస్తకంగా ఆవిష్కరిస్తున్నారు. శ్రీదేవి కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తిని పెళ్లాడిందన్న పుకార్లు షికారు చేశాయి. అసలు అందులో నిజం ఎంతో తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. అలాగే చిరంజీవి హీరోగా ఓ సినిమా నిర్మించాలన్న కోరిక శ్రీదేవికి ఉండేది. కానీ అది నెరవేరకపోవడానికి కారణమేంటో ఈ పుస్తకంలో వెల్లడించారని తెలుస్తోంది. బోనీతో పెళ్లి సహా ఇంకా ఎన్నో టాప్ సీక్రెట్స్ ని ఈ బుక్ లో రివీల్ చేశారట.

అస్సలు టెన్షన్ వద్దు.. 'అత్తారింటికి దారేది' ఆగదు

Vantha-Rajavathaan-Varuven-Release-Date-Simbu-STR-Statement-Andhra-Talkies
Vantha-Rajavathaan-Varuven-Release-Date-Simbu-STR-Statement-Andhra-Talkies
తమిళ స్టార్ హీరో శింబు ఎంత వివాదాస్పదుడు అయినా కూడా ఆయనకు భారీ ఫ్యాన్స్ ఉంటారు. శింబు యాటిట్యూడ్ కారణంగా అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. ఈమద్య కాలంలో సూపర్ హిట్ లు ఏమీ లేకున్నా కూడా శింబును ఆయన ఫ్యాన్స్ అభిమానిస్తూనే ఉంటారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నవాబ్’ చిత్రంతో శింబు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళంలో రీమేక్ అవుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రంను అడ్డుకుంటామని గతంలో శింబుతో సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చిన ఒక నిర్మాత హెచ్చరిస్తున్నాడు.

శింబు కొన్నాళ్ల క్రితం ‘అన్భనవన్ అసరదవన్ అదన్గదవన్’(అఅఅ) చిత్రం చేసేందుకు నిర్మాతల వద్ద అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ చిత్రం షూటింగ్ కొంత పూర్తి అయిన తర్వాత ఏదో కారణం వల్ల సినిమా నుండి శింబు తప్పుకున్నాడట. శింబు ఆ సినిమా నుండి తప్పుకోవడంతో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయాం అంటూ చట్టపరమైన చర్యలకు సిద్దం అయ్యారట. తమ బ్యానర్ లో మొదలు పెట్టిన ‘అఅఅ’ చిత్రంను పూర్తి చేసిన తర్వాతే శింబు మరే సినిమాను అయినా విడుదల చేసుకోవాలంటూ ఆ నిర్మాతలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

తెలుగు చిత్రపరిశ్రమ గ్రేట్ నటుడు కోట శ్రీనివాసరావు బయోగ్రఫీ | Tollywood Great Actor Kota Srinivasarao Biography In Book Andhra Talkies

Tollywood-Great-Actor-Kota-Srinivasa-Rao-Biography-In-Book-Andhra-Talkies
Kota Srinivasarao Biography 
నాలుగు దశాబ్ధాల నటజీవితంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు. 76 వయసులోనూ ఆయన అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. ఉన్న మాటను ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతూ నిరంతరం చర్చల్లో నిలుస్తుంటారు. పరభాషా నటుల ప్రాపకాన్ని సహించలేని కోట దానిపై పలుమార్లు విరుచుకుపడిన సంగతిని గుర్తు చేసుకోవాలి. నవరసాల్ని అలవోకగా పోషించే గ్రేట్ ఆర్టిస్టు. అందుకే కోట అంటే తెలుగువారికి ఎనలేని గౌరవం. విలనీకి రావు గోపాల్ రావ్ తర్వాత అంతటి అర్థం చెప్పిన మహానటుడు ఆయన.

మోడ్రన్ సినిమాల్లో కుప్పిగంతులు.. ఆర్టిస్టుల వెకిలితనాన్ని ఆయన తనదైన శైలిలో విమర్శిస్తుంటే చాదస్తం కోట అని అన్నవాళ్లు.. ఉడుక్కునేవాళ్లకు కొదవేం లేదు. నాటి సినిమాల సెట్స్లో ఉండే వాతావరణ ఇప్పుడు లేదని దర్శకనిర్మాతల్ని - తోటి ఆర్టిస్టుల్ని ఆయన చురకలు వేయడంతో ఈ పేరొచ్చిందేమో బహుశా. ఏదేమైనా వందలాది చిత్రాల్లో నటించిన కోట ఇతరులతో పోటిస్తే ఎంతో విలక్షణుడు. హీరోయిన్ ముందు హీరో కోతిలా గెంతుతూ ఉంటాడు. కిందపడి గిలగిల కొట్టుకుంటుంటాడు. అదేం డాన్స్ అంటే.. ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్ళల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా.. గెంతరు కదా. పద్ధతిగా.. హుందాగా నడుచుకుంటారు. కానీ సినిమాల్లో అలా ఎందుకుంటారో? అలాగే ప్రతి పాటకూ బ్యాగ్రౌండ్ లో 50 మంది డ్యాన్సర్లుంటారు. ఇంతమంది అవసరమా అనిపిస్తుంది. గత సినిమాలలో హీరో జైలు కెళితే మాసిన గడ్డంతో దర్శకులు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖమంతా గడ్డముంటే హీరో ఎలా అవుతాడు? అని చురకలు వేశారాయన. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.

అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

Akshara-hassan-Selfies-Andhra-Talkies
అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతుర్లు ఇద్దరు కూడా చాలా స్వాతంత్య్రంగా తండ్రి హెల్ప్ లేకుండా సినిమా ఇండ్రస్టీలో ఎంట్రీ ఇచ్చారు. శృతిహాసన్ ఇప్పటికే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్నమ్మాయి అక్షర హాసన్ దర్శకత్వ శాఖలో చేస్తూ హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అక్షర హాసన్ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. లో దస్తుల్లో ఆమె తీసుకున్న సెల్ఫీ లు వివాదాస్పదం అయ్యాయి. ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి ఫొటోలపై అక్షర రియాక్షన్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.

తాజాగా అక్షర హాసన్ ఆ విషయమై స్పందించింది. ఆ ఫొటోలు లీక్ అవ్వడం నాకు ఆశ్చర్యంను కలిగించింది. నేను చేయాల్సిన ఒక సినిమా కోసం తీసుకున్న స్టిల్స్ అవి. వాటిని నేను ప్రొఫెషనల్ గానే తీశాను తప్ప మరే ఉద్దేశ్యం లేదు. లీక్ అయిన ఫొటోల గురించి మరీ ఇంతగా ఎందుకు చర్చ జరుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫొటోల్లో ఉన్న తప్పేంటీ అంటూ అక్షర ప్రశ్నించింది. మళ్లీ అవసరమైతే అలాంటి ఫొటోలు నేను తీసుకుంటాను అందుకు నేను ఏమాత్రం వెనుకాడను అంది.

పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్ | Amir, who is open on a children's film debut

పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్ | Amir, who is open on a children's film debut

Aamir-Khan-Son-and-Daughter-Debut-Andhra-Talkies
అమీర్ ఖాన్ కు బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు. సినిమాల విషయంలో అమీర్ పడే తపన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తన కుటుంబసభ్యుల గురించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడతాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కాఫీ విత్ కరణ్ చాట్ షో లో పాల్గొన్నాడు.  తన పిల్లల సినిమా ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యాడు.

కొడుకు జునైద్..కూతురు ఐరా కు సినిమాల్లోకి రావాలనే ఉందని వెల్లడించాడు. జునైద్ కి యాక్టర్ కావాలని.. డైరెక్షన్ కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. కానీ తను ఎంచుకున్న మార్గం పూలబాట ఏమీ కాదని ఒక క్లిష్టమైన దారి అని ముందే హెచ్చరించాడట. అమీర్ ఖాన్ కొడుగ్గా తనకు పోలికలు ఎదురవుతాయని వాటన్నిటికి సిద్దంగా ఉండాల్సిందే అని చెప్పేశాడట.   కుమారుడికి తనవైపు నుండి ఎటువంటి సపోర్ట్ ఇవ్వనని తేల్చేశాడు. కూతురి విషయంలో కూడా తన వైఖరి ఏమీ మారదని అన్నాడు.  వాళ్ళే కష్టపడి తమకు కావాల్సింది సాధించుకోవాలని.. నేను వారికి సపోర్ట్ ఇవ్వడం సినిమాకు.. ప్రేక్షకులకు అన్యాయం చేయడమే అన్నాడు.

తన కూతురు సినిమాలో ఏ డిపార్ట్మెంట్ అంటే ఇష్టపడుతుందో తనకు ఇంకా తెలియదని అన్నాడు. ఇక వాళ్ళిద్దరికీ ఫీడ్ బ్యాక్ ఇచ్చే విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటానని చెప్పాడు. తన కొడుక్కి అర్హత లేదు అంటే ఆ విషయంలో తను సపోర్ట్ ఇవ్వడం జరగదని అన్నాడు.  చూస్తుంటే.. మరీ కఠినాత్ముడైన తండ్రిలా ఉన్నాడే..!
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...