అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

Akshara-hassan-Selfies-Andhra-Talkies
అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతుర్లు ఇద్దరు కూడా చాలా స్వాతంత్య్రంగా తండ్రి హెల్ప్ లేకుండా సినిమా ఇండ్రస్టీలో ఎంట్రీ ఇచ్చారు. శృతిహాసన్ ఇప్పటికే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్నమ్మాయి అక్షర హాసన్ దర్శకత్వ శాఖలో చేస్తూ హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అక్షర హాసన్ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. లో దస్తుల్లో ఆమె తీసుకున్న సెల్ఫీ లు వివాదాస్పదం అయ్యాయి. ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి ఫొటోలపై అక్షర రియాక్షన్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.

తాజాగా అక్షర హాసన్ ఆ విషయమై స్పందించింది. ఆ ఫొటోలు లీక్ అవ్వడం నాకు ఆశ్చర్యంను కలిగించింది. నేను చేయాల్సిన ఒక సినిమా కోసం తీసుకున్న స్టిల్స్ అవి. వాటిని నేను ప్రొఫెషనల్ గానే తీశాను తప్ప మరే ఉద్దేశ్యం లేదు. లీక్ అయిన ఫొటోల గురించి మరీ ఇంతగా ఎందుకు చర్చ జరుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫొటోల్లో ఉన్న తప్పేంటీ అంటూ అక్షర ప్రశ్నించింది. మళ్లీ అవసరమైతే అలాంటి ఫొటోలు నేను తీసుకుంటాను అందుకు నేను ఏమాత్రం వెనుకాడను అంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...