శ్రీదేవి సీక్రెట్స్ బయట పెట్టనున్న "అతిలోక సుందరి శ్రీదేవి కథ" పుస్తకం | Sridevi Secrets is a book of the "Athiloka Sundari Sridevi" book

Athiloka-Sundari-Sridevi-Book-on-Secrets-in-Sridevi-Life-Andhra-Talkies
Sridevi Secrets is a book of the "Athiloka Sundari Sridevi" book
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం గురించి తెలిసిందే. దుబాయ్ లో చుట్టాల పెళ్లికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ ఘటనను శ్రీదేవి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. కాలంతో పాటే మరపు. శ్రీదేవి తర్వాత వారసురాలు జాన్వీలోనే తనని చూసుకుంటున్నారు ఫ్యాన్స్. జాన్వీ ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసి కథానాయికగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ సన్నివేశంలో శ్రీదేవి సీక్రెట్స్ ని రివీల్ చేస్తూ ఓ పుస్తకం లాంచింగ్ కి రెడీ అవుతుండడం ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చకొచ్చింది.

అతిలోక సుందరి శ్రీదేవి కథ` పేరుతో ఈ పుస్తకాన్ని సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించారు. మద్రాసు పరిశ్రమ నుంచి హైదరాబాద్ లో టాలీవుడ్ వేళ్లూనుకునే క్రమంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు వంటి స్టార్ల సరసన శ్రీదేవి నటించారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ లో గొప్ప అభినయనేత్రిగా నిరూపించుకున్నారు. ఆ సమయంలోనే శ్రీదేవిని పలుమార్లు పసుపులేటికి ఇంటర్వ్యూలు చేశారు. శ్రీదేవి కెరీర్ ఆద్యంతం అత్యంత సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టు ఆయన. శ్రీదేవికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఆయనకు తెలుసు. వాటన్నిటినీ గుదిగుచ్చి ఇప్పుడు పుస్తకంగా ఆవిష్కరిస్తున్నారు. శ్రీదేవి కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తిని పెళ్లాడిందన్న పుకార్లు షికారు చేశాయి. అసలు అందులో నిజం ఎంతో తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. అలాగే చిరంజీవి హీరోగా ఓ సినిమా నిర్మించాలన్న కోరిక శ్రీదేవికి ఉండేది. కానీ అది నెరవేరకపోవడానికి కారణమేంటో ఈ పుస్తకంలో వెల్లడించారని తెలుస్తోంది. బోనీతో పెళ్లి సహా ఇంకా ఎన్నో టాప్ సీక్రెట్స్ ని ఈ బుక్ లో రివీల్ చేశారట.పసుపులేటి ఇదివరకూ మెగాస్టార్ చిరంజీవిపై పలు పుస్తకాల్ని రచించారు. చిరంజీవితం 150 - వెండితెర విషాద రాగాలు - అద్భుత నటి సావిత్రి వంటి పుస్తకాల్ని పసుపులేటి రచించి మార్కెట్ లో రిలీజ్ చేశారు. పసుపులేటి ప్రచురణలు పేరుతో ఈ పుస్తకాల్ని ఆవిష్కరిస్తున్నారు. తాజాగా శ్రీదేవి జీవితంపై పలు ఆసక్తికర విషయాల్ని ఆయన `అతిలోక సుందరి శ్రీదేవి కథ`  పుస్తకంలో పొందుపరిచారట. త్వరలోనే లాంచింగ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...