సందీప్ కిషన్ ఈసారి కొత్త ప్రయత్నం

Hero-Sundeep-Kishan-With-Hansika-Andhra-Talkies
Hero Sundeep Kishan With Heroin Hansika-Andhra-Talkies
సందీప్ హీరోగా కెరీర్ ఆరంభించి చాలా కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు అట్టట్ట మాత్రమే ఆకట్టుకుంటూ వస్తున్నాడు. బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ లు ఈయనకు పడటం లేదు. అప్పుడెప్పుడో పడ్డ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత మళ్లీ సందీప్ కిషన్ కు ఏ సినిమా కూడా సక్సెస్ ను తెచ్చి పెట్టలేక పోతున్నాయి. అయినా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు కోహ్లీ దర్శకత్వంలో ‘నెక్ట్స్ ఏంటీ’ అనే చిత్రాన్ని చేశాడు. అడల్ట్ కంటెంట్ తో ఈ తరం యువకులను టార్గెట్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రంపై సందీప్ కిషన్ చాలా నమ్మకంతో ఉన్నాడు. తమన్నా హీరోయిన్ గా నెక్ట్స్ ఏంటీ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. తాజాగా సందీప్ కిషన్ మరో సినిమా ప్రకటన వచ్చింది.

కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక చిత్రం తెరకెక్కబోతుంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని టైటిల్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ అనే టైటిల్ తో మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హన్సికను మళ్లీ ఈ చిత్రంతో సందీప్ కిషన్ తీసుకు వస్తున్నాడు.


గతంలో మంచి కామెడీ సినిమాలు చేసిన నాగేశ్వరరెడ్డి గత కొంత కాలంగా ఫామ్ లో లేడు. అయినా కూడా ఒక మంచి సినిమా ఆయన నుండి వస్తుందని ఇప్పటికి ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. మంచి కాన్సెప్ట్ దొరికితే నాగేశ్వరరెడ్డి కుమ్మేస్తాడని కొందరు నమ్ముతున్నారు. మరి సందీప్ కిషన్ మొదటి సారి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ కనుక ఏ స్థాయిలో తన కామెడీతో ఆకట్టుకుంటాడనేది చూడాలి. కామెడీ సినిమాల్లో నటించాలంటే మంచి కామెడీ టైమింగ్ ఉండాలి. మరి అది సందీప్ కు ఏ స్థాయిలో ఉందో సినిమా విడుదల అయితే కాని చెప్పలేం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...