స్టార్ హీరో కూతురి నైనా నాకు అవి తప్పలేదు : వరలక్ష్మి

Heroin-Varalakshmi-About-Bad-Incidents-Andhra-Talkies
Heroin Varalakshmi About Bad Incidents-Andhra Talkies
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు అనేవి స్వరసాదారణమైన విషయం. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చిన వారు ఎందరో మీటూ అంటూ తమపై జరిగి జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటకు చెబుతున్నారు. అయితే ఎంతో మంది లైంగిక వేదింపుల ఆరోపణలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నా కూడా వారసులు మాత్రం అందుకు మినహాయింపు అనుకున్నారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ కు కాస్టింగ్ కౌచ్ బాధ లేదు లైంగిక వేదింపులు అసలే ఉండవని అనుకుంటాం. కాని స్టార్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా లైంగిక వేదింపులు తప్పలేదట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి తనకు ఎదురైన లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను కొన్ని సార్లు లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది. చిన్నప్పటి విషయాన్ని పక్కకు పెడితే హీరోయిన్ అయిన తర్వాత ఒక టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అంటూ ప్రశ్నించాడు. మిగిలిన విషయాలు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు బయట మాట్లాడుకుందా అన్నాడంటే అతడి ఉద్దశ్యం ఏంటో చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన ఆ మాటకు తీవ్ర ఆగ్రహం కలిగింది. కాని తాను ఆ సమయంకు కాస్త సంయమనం పాటించి అక్కడ నుండి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.


స్టార్ కిడ్స్ కు కూడా ఇలాంటి వేదింపులు తప్పవని వరలక్ష్మికి ఎదురైన అనుభవం ద్వారా చెప్పుకోవచ్చు. స్టార్ కూతురు అయినా కూడా వరలక్ష్మి కేవలం హీరోయిన్ పాత్రల కోసమే చూడకుండా తనలోని నటిని సంతృప్తిపర్చుకునేందుకు విలన్ పాత్రలు కూడా పోషిస్తూ వస్తోంది. తాజాగా పందెంకోడి 2 మరియు సర్కార్ చిత్రాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలే వస్తే తప్పకుండా చేస్తాను అంటూ ప్రకటించింది. ఒక మోస్తరులో ఎక్స్ పోజింగ్ కు ఓకే కాని అవసరం లేకున్నా స్కిన్ షో చేయను అంటూ ఈమె తెగేసి చెప్పేసింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...