రాజమౌళికి బై.. బై చెప్పేసిన చరణ్!!

Ram-Charan-for--RRR-Movie-Andhra-Talkies
Charan told BYE to Rajamouli !!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత నెలలో హైదరాబాద్ శివారులోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయిన ఈ మల్టీస్టారర్ మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇద్దరు కూడా పాల్గొన్న విషయం తెల్సిందే. షూటింగ్ ప్రారంభం రోజే జక్కన్న ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ దర్శకుడు రాజమౌళికి షార్ట్ బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుని ఉన్న విషయం తెల్సిందే. దీక్ష ముగింపుకు చరణ్ ఈనెల 7న శబరిమల వెళ్లనున్నాడు. అక్కడ నుండి 9వ తారీకు వరకు వచ్చేయనున్నాడు. 10వ తారీకు నుండి వెంటనే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో బ్యాలన్స్ ఉన్న ఆ చివరి పాటను చేయబోతున్నాడు. ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొనబోతున్నాడు. ఆ లోపు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. దాంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు.


‘వినయ విధేయ రామ’ చిత్రంతో వచ్చే సంక్రాంతి వరకు కూడా చరణ్ బిజీగానే గడుపబోతున్నాడు. ఈ గ్యాప్ లో మళ్లీ ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ కు చరణ్ డేట్లు ఇవ్వలేదని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మళ్లీ జక్కన్న అండ్ ఎన్టీఆర్ లతో చరణ్ జాయిన్ కాబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా జక్కన్నకే అంకితం అయ్యాడు. వినయ విధేయ కోసం బై బై చెప్పి - చిన్న బ్రేక్ తీసుకున్న చరణ్ సంక్రాంతి తర్వాత సినిమా పూర్తి అయ్యే వరకు జక్కన్నకు అందుబాటులో ఉండనున్నాడు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్స్ విషయంలో జక్కన్న క్లారిటీ ఇవ్వలేదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...