మరో 'గీత గోవిందం' కు ఛాన్స్ ఉందా? | Is there another chance for 'Geeta Govindam'?

Rashmika-Mandanna-on-About-Dear-Camrade-Movie-Andhra-Talkies
 Is there another chance for 'Geeta Govindam'?
సూపర్ హిట్ మూవీస్ సీక్వెల్స్ రావడం అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితని చెప్పనక్కర్లేదు. అదే దారిలో ‘గీత గోవిందం’ చిత్రం సీక్వెల్ కూడా వస్తుందంటూ సోషల్ మీడియాలో ఈమద్య తెగ ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ చిత్రంతో విజయ్ దేవరకొండ - రష్మికలు ఓవర్ నైట్ లో స్టార్స్ అయ్యారు. ఇలాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్స్ కావాలని ప్రేక్షకులు ఆశించడం చాలా కామన్. సక్సెస్ అయినంత మాత్రాన సీక్వెల్ కావాలంటే కుదరదు. సీక్వెల్ కు స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం.

‘గీత గోవిదం’ చిత్రం కథ ఆరంభం అంతం కూడా సాఫీగా సాగిపోయింది. గీత గోవిందంలు పెళ్లి చేసుకోవడంతో సినిమా పూర్తి అయ్యింది. ఇంకా సీక్వెల్ కు కథ ఎక్కడ మిగిలి ఉంది. ఏదో క్రియేట్ చేసి సీక్వెల్ చేద్దామని ప్రయత్నిస్తే మొత్తం కంపు అయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ అలాంటి ప్రయత్నాలకు అస్సలు సపోర్ట్ చేయడని కొందరు అభిప్రాయం. అంటే ‘గీత గోవిందం’ చిత్రానికి సీక్వెల్ వచ్చే ఛాన్సే లేదు.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్ మెల్లగా సాగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత కామ్రేడ్ గా దేవరకొండ రాబోతున్నాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలకు కూడా దేవరకొండ కమిట్ అయ్యి ఉన్నాడు. సీక్వెల్ గురించిన ఆలోచన దేవరకొండలో ఉన్నట్లే లేదు. పరుశురామ్ కూడా సీక్వెల్ గురించి ఆలోచించకుండా ఇతర సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...