జూహీ చావ్లాతో గొడవ కారణంగా ఏడు సంవత్సరాలు మాట్లాడలేదు

Bollywood-Heroin-Juhi-Chawla-And-Aamir-Khan-Stopped-Talking-To-Each-Other-For-Five-Years-Andhra-Talkies
బాలీవుడ్ లో ఒకప్పుడు అమీర్ ఖాన్ - జూహీ చావ్లా హిట్ పెయిర్ గా మంచి సక్సెస్ లను దక్కించుకున్నారు. ఖయామత్ సే ఖయామత్ తక్ తో పాటు ఇంకా పలు చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించి సక్సెస్ లను దక్కించుకున్నారు. జూహ్లీ చావ్లా హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసింది - అమీర్ ఖాన్ మాత్రం ఇంకా బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. జూహీ చావ్లా ఇండస్ట్రీలో లేకున్నా కూడా అమీర్ ఖాన్ ఇంకా ఆమెతో మంచి స్నేహంను కొనసాగిస్తున్నాడట. ఇద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చిన అమీర్ ఖాన్ గతంలో తామిద్దరం ఒక చిన్న  గొడవ కారణంగా ఏడు సంవత్సరాలు మాట్లాడుకోలేదని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. జూహీ చావ్లాతో 'ఇష్క్' సినిమా సమయంలో గొడవ అయ్యింది. చిన్న విషయంలో మొదలైన ఆ గొడవ పెద్దదయ్యింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురు పడ్డా కూడా మాట్లాడుకునే వాళ్లం కాదు. ఎడమొహం - పెడమొహంగానే ఆ సినిమాను పూర్తి చేశాం. ఆ చిత్రం షూటింగ్ సమయంలో జూహీకి ఎంత దూరం వీలైతే అంత దూరం ఉండేవాడిని - ఆ సమయంలో నాకు అహం ఎక్కువ ఉండేది.ఆరు ఏడు సంవత్సరాల తర్వాత నేను విడాకులు తీసుకుంటున్నట్లుగా తెలిసి జూహీ ఫోన్ చేసింది. విడాకులు తీసుకోవద్దంటూ సూచించింది. నాతో పాటు - ఆ సమయంలో నా భార్యతో కూడా మాట్లాడింది. విడాకులు తీసుకోకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించింది. నేను ఆమెతో మాట్లాడకున్నా కూడా నా జీవితం గురించి ఆలోచించి విడాకులు వద్దంటూ చెప్పేందుకు ప్రయత్నించిన జూహీ మంచి మనసును ఇన్నాళ్లు అర్థం చేసుకోలేక పోయానని అనిపించింది. అప్పటి నుండి మళ్లీ జూహీతో సన్నిహితంగా ఉంటున్నాను. జూహీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ అమీర్ చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...