అనసూయ చెల్లితో ఆది గ్రాండ్ రీ ఎంట్రీ

Hyper-Adi-Re-Entry-with-Anasuya-Sister-andhra-talkies
Hyper-Adi-Re-Entry-with-Anasuya-Sister-andhra-talkies
జబర్దస్త్ షో మొత్తం ఒంటి చేత్తో నడిపించిన ఆది గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. జబర్దస్త్ లో ఆది కనిపించకుండా పోవడంతో రకరకాలుగా వార్తలు వచ్చాయి. రైజింగ్ రాజు ఒక్కడే టీంను లీడ్ చేస్తుండటంతో అసలు జబర్దస్త్ షో పైనే ఆసక్తి లేదంటూ పంచ్ లు పడ్డాయి. వరుసగా సినిమాల్లో ఆఫర్లు - పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆదికి దక్కుతున్న నేపథ్యంలో ఇక ఆది చిల్లర కామెడీ షో జబర్దస్త్ కు రాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆది లేడు అంటూ అలవాటు పడిపోతున్న ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ మరింత హైపర్ తో ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు.

వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ షోలో ఆది స్కిట్ ప్రసారం కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా పడింది. రెండు నెలల గ్యాప్ తర్వాత వస్తున్నానంటూ ఆది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో సగానికి పైగా ఆది స్కిట్ నే చూపించారంటే ఏ స్థాయిలో ఆది ఎంటర్ టైన్ చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఆది వచ్చి రావడంతోనే రోజాతో డాన్స్ వేయడం - బాలకృష్ణ పై నాగబాబు చేసిన కామెంట్స్ పై పంచ్ వేయడం అందరిని తెగ నవ్వించేస్తోంది.వచ్చే వారం ఆది స్కిట్ లో అసలైన ట్విస్ట్ ఏంటీ అంటే అనసూయ చెల్లి వైష్ణవి రావడం. అనసూయ డాన్స్ చేసేందుకు రాను అనడం నీకు ట్విస్ట్ ఇవ్వనా అంటూ వైష్ణవిని తీసుకు రావడం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలువబోతుంది. వచ్చే వారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆలోపు ప్రోమో అయినా చూసేద్దాం అనుకుంటూ యూట్యూబ్ లో కేవలం 24 గంటల్లో 2.2 మిలియన్స్ మంది చూసేశారు. ఆది రీ ఎంట్రీ ఏ స్థాయిలో ఉందో ఈ వ్యూస్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ప్రోమోకే 24 గంటల్లో రెండు మిలియన్ ల వ్యూస్ వస్తే ఇక స్కిట్ మొత్తానికి ఏ స్థాయిలో వ్యూస్ వస్తాయో ఇక చెప్పనక్కర్లేదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...